🔴 Pahalgam Terror Attack Live Updates: పహల్గామ్ టెర్రర్ అటాక్.. లైవ్ అప్డేట్స్
పహల్గామ్ టెర్రర్ అటాక్ లైవ్ అప్డేట్లు ఎప్పటికప్పుడు మీ కోసం
పహల్గామ్ టెర్రర్ అటాక్ లైవ్ అప్డేట్లు ఎప్పటికప్పుడు మీ కోసం
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు కశ్మీర్‌లోనే ఉన్న 15 మంది కశ్మీరీలే సహాయం చేశారని NIA దర్యాప్తులో వెల్లడైంది. ఎలక్ట్రానిక్ నిఘా ఆధారంగా ఈ సహాయకులను గుర్తించారు. ఈ వ్యక్తులు ఉగ్రవాదులకు లాజిస్టిక్స్ అందించారని సమాచారం.
కశ్మీర్ ఇండియాదే.. కశ్మీరీలు మనవాళ్లే అని విజయ్ అన్నారు. కశ్మీర్లో జరుగుతున్న దారుణాలకు సరైన చదువు లేకపోవడమే. కారణమని విజయ్ అభిప్రాయపడ్డారు. వాళ్లందరికీ చదువు చెప్పించి, బ్రెయిన్‌వాష్ కాకుండా ఉండేలా శిక్షణ ఇవ్వాలన్నారు.
జమ్మూ కాశ్మీర్ అంతటా చురుకుగా పనిచేస్తున్నట్లు భావిస్తున్న 14 మంది స్థానిక ఉగ్రవాదుల జాబితాలను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సిద్ధం చేశాయి. ప్రతి ఒక్క ఉగ్రవాది గురించి సమాచారాన్ని సేకరించింది. వీళ్లంతా జమ్మూ కాశ్మీర్లో ఉంటూనే ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ బజరంగ్ దళ్ కార్యకర్తలు కర్ణాటకలోని రోడ్లపై పాక్ జెండాలను అతికించి నిరసన చేపట్టారు. అయితే ఈ నిరసనలకు అనుమతి తీసుకోలేదనే కారణంతో పోలీసులు ఆరుగురు బజరంగ్ దళ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని బెజవాడలో పాకిస్తాన్ కాలనీ ఉందని మీలో ఎంతమందికి తెలుసు. 1980లో పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల కోసం విజయవాడలో పాకిస్తాన్ కాలనీ ఏర్పాటు చేశారు. వారంతా పాకిస్థానీలే కాబట్టి దానికి పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత యుద్ధ వాతావరణం ఇరు దేశాల మధ్య చోటుచేసుకుంది. పాక్‌తో యుద్ధానికి తాము అనుకూలంగా లేమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. దీనికి ముఖ్య కారణం భద్రతా వైఫల్యమేనని ఆరోపించారు. కాశ్మీర్లో కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేయాలని తెలిపారు.