/rtv/media/media_files/2025/04/27/rbckhlVocYemzjUv8m1T.jpg)
15 local cadres helped
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో హిందువుల ఊచకోత తర్వాత భద్రతా దళాలు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాయి. ఉగ్రవాద దాడి తర్వాత, భద్రతా దళాలు ఉగ్రవాదులపై ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. ఇప్పటివరకు అక్కడ 9 మంది ఉగ్రవాదుల ఇళ్ళను పేల్చేశాయి. పుల్వామాలోని త్రాల్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాది అమీర్ నజీర్ ఇంటిని కూల్చివేశారు. అదే సమయంలో, పుల్వామాలోని ఖాసిపోరాలో జైషే ఉగ్రవాది అమీర్ నజీర్ వాని ఇంటిని పేల్చివేశారు. అంతకుముందు, షోపియన్ జిల్లాలోని వందినా ప్రాంతంలో ఉగ్రవాది అద్నాన్ షఫీ ఇంటిని కూల్చివేశారు. అద్నాన్ షఫీ దాదాపు ఏడాది క్రితం లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో చేరాడు. ఇక కుప్వారాలో ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్ ఇంటిని పేల్చివేశారు. వీటన్నింటినీ కలుపుకుని, ఇప్పటివరకు కశ్మీర్ లో మొత్తం 9 మంది ఉగ్రవాదుల ఇళ్ళు నేలమట్టమయ్యాయి.
Also Read : Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!
Also read : Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
15 మంది కశ్మీరీలే సహాయం
మరోవైపు, పహల్గామ్ ఉగ్రవాద దాడి దర్యాప్తును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ NIAకి అప్పగించింది. ఇప్పుడు NIA జమ్మూ కశ్మీర్ పోలీసుల నుండి పహల్గామ్ కేసును టెకాఫ్ చేసింది. శ్రీనగర్‌లో, ఉగ్రవాద సహాయకులకు సంబంధించిన 64 ప్రదేశాలపై UAPA కింద చర్యలు తీసుకోబడ్డాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు కశ్మీర్‌లోనే ఉన్న 15 మంది కశ్మీరీలే సహాయం చేశారని దర్యాప్తులో వెల్లడైంది. ఎలక్ట్రానిక్ నిఘా ఆధారంగా ఈ సహాయకులను గుర్తించారు. ఈ వ్యక్తులు ఉగ్రవాదులకు లాజిస్టిక్స్ అందించారని సమాచారం. ఉగ్రవాదులు ఎంటర్ కావడానికి మార్గనిర్దేశం చేశారని, దాడులలో ఉపయోగించడానికి పాకిస్తాన్ నుండి ఆయుధాలను కూడా సమకూర్చారని తెలుస్తోంది. వారి అరెస్టుపై నిర్ణయం తీసుకునే ముందు కుట్రను ఛేదించడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
Also read : India-Pakistan: మేం ఆయుధాలు లేని సైనికులం..పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమే!
Also read : Bike Accident : తండ్రికి బైక్‌ను గిప్ట్గా ఇచ్చేందుకు వెళ్తూ అనంతలోకాలకు!