Vijay Deverakonda : ఆ నా కొడుకులను.. కశ్మీర్ పై హీరో విజయ్ దేవరకొండ హాట్ కామెంట్స్!

కశ్మీర్ ఇండియాదే.. కశ్మీరీలు మనవాళ్లే అని విజయ్ అన్నారు.  కశ్మీర్‌లో జరుగుతున్న దారుణాలకు సరైన చదువు లేకపోవడమే. కారణమని విజయ్ అభిప్రాయపడ్డారు. వాళ్లందరికీ చదువు చెప్పించి, బ్రెయిన్‌వాష్‌ కాకుండా ఉండేలా శిక్షణ ఇవ్వాలన్నారు. 

New Update

కశ్మీర్ పై హీరో విజయ్ దేవరకొండ హాట్ కామెంట్స్ చేశారు.  సూర్య హీరోగా తెరకెక్కిన రెట్రో మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా వెళ్లిన విజయ్  సంచలన వ్యాఖ్యలు చేశారు.  కశ్మీర్ ఇండియాదే.. కశ్మీరీలు మనవాళ్లే అని విజయ్ అన్నారు.  కశ్మీర్‌లో జరుగుతున్న దారుణాలకు సరైన చదువు లేకపోవడమే. కారణమని విజయ్ అభిప్రాయపడ్డారు. వాళ్లందరికీ చదువు చెప్పించి, బ్రెయిన్‌వాష్‌ కాకుండా ఉండేలా శిక్షణ ఇవ్వాలన్నారు. 

తాను రెండేళ్ల కిందట ఖుషి సినిమా కోసం అక్కడ షూటింగ్‌కు వెళ్తే తనను చాలా బాగా చూసుకున్నారని విజయ్ గుర్తుచేసుకున్నారు. పాకిస్థాన్‌లో నీళ్లు, కరెంట్‌ లేక ఇబ్బంది పడుతుంటే, వాటి సంగతి చూసుకోకుండా ఇక్కడకు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారో తనకు అర్థం కావటం లేదన్నారు విజయ్ . పాకిస్థాన్‌పై మనందాడి చేయాల్సిన అవసరం లేదన్న విజయ్  కొన్ని రోజులు పోతే, ఆ దేశ ప్రజలే అక్కడి ప్రభుత్వంపై దాడి చేస్తారంటూ కామెంట్స్ చేశారు. దేశం విషయంలో మనమంతా ఒక్కటిగా కలిసి ఉండాలని పిలుపునిచ్చారు.  

Also read :  India-Pakistan: మేం ఆయుధాలు లేని సైనికులం..పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమే!

Also read : Bike Accident : తండ్రికి బైక్‌ను గిప్ట్గా ఇచ్చేందుకు వెళ్తూ అనంతలోకాలకు!

దువు ఒక్కటే అత్యుత్తమమైన మార్గం 

జీవితంలో ముందుకు వెళ్లాంటే అందుకు చదువు ఒక్కటే అత్యుత్తమమైన మార్గమని విజయ్ చెప్పుకొచ్చారు. మనం, మన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నప్పుడే దేశం కూడా ముందుకు వెళ్తుందని తెలిపారు.   చదువులో తానేమీ టాపర్‌ను కాదని చెప్పిన విజయ్..  విద్యార్థులకు తన వంతుగా సాయం చేస్తానని తెలిపారు.  కాగా రెట్రో సినిమాలో సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా  నటించింది. మే 1న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, తెలుగులో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు. 

Also Read :   Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

Vijay Deverakonda | suriya | Retro | pahalgam terror attack | jammu and kashmir terror attack | jammu and kashmir news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు