Stock Market: లాభాల్లో షేర్ మార్కెట్..రాణించిన బ్యాంకింగ్ షేర్లు
చాలా రోజుల తర్వాత ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 363 పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లతో సూచీలు రాణించాయి.