AP: వాలంటీర్లకు ఆ అలవెన్స్ రద్దు చేసిన ప్రభుత్వం!
ఏపీలో గత ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన పేపర్ అలవెన్స్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వం తమ పేపర్ సర్క్యూలేషన్ ను పెంచుకోవడానికే ఇలా అలవెన్స్ లు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఏపీలో గత ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన పేపర్ అలవెన్స్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వం తమ పేపర్ సర్క్యూలేషన్ ను పెంచుకోవడానికే ఇలా అలవెన్స్ లు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
AP: ఈరోజు సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు బాధ్యతలు చేపట్టారు. వైసీపీ పాలనలో పోలవరం నిర్మాణాన్ని అసలు పట్టించుకోలేదని విమర్శించారు. తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పోలవరానికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తామని తెలిపారు.
కేంద్ర మంత్రివర్గం సభ్యుల్లో 70 మంది (99 శాతం) కోటీశ్వరులేనని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) మంగళవారం ఓ నివేదికలో వెల్లడించింది. మంత్రుల సగటు ఆస్తి విలువ దాదాపు రూ.107.94 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది.
ఈ రోజు విజయవాడలో నిర్వహించిన ఎన్డీఏ ఎమ్మెల్యేల భేటీలో చంద్రబాబుకు నేతలు ప్రత్యేక కుర్చీ వేశారు. అయితే.. చంద్రబాబు వేదికపైకి రాగానే తన సిబ్బందికి చెప్పి ఆ కుర్చీని మార్పించారు. పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ కూర్చున్న లాంటి కుర్చీనే తన కోసం తెప్పించుకున్నారు.
కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరింది. ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు వారికి శాఖలను కేటాయిస్తారని చెబుతున్నారు. సాయంత్రం తొలి క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఆ సమావేశం ముందు పోర్ట్ ఫోలియోలు కేటాయించే అవకాశం ఉంది.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మోదీతో కలిపి మొత్తం 72 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 30 మంది కేబినేట్ మంత్రులు, 5 గురు సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా), 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.
కేంద్ర కేబినెట్లో ఇద్దరు టీడీపీ ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు రానున్నాయి. రామ్మోహన్ నాయుడుకి కేంద్రమంత్రి పదవి.. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. రేపు ప్రధాని మోదీతో పాటు పలువురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
టీడీపీకి ప్రధాని మోదీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పౌర విమానయాన, వైద్యారోగ్య శాఖలతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి టీడీపీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ రాకపోవడంతో.. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్‌కు ఇండియా కుటమి నుంచి ప్రధాని ఆఫర్ వచ్చిందని.. కానీ ఆయన ఆఫర్‌ను తిరస్కరించారని జేడీయూ నేత కేసీ త్యాగి వెల్లడించారు. తాము ఎన్డీయేలోనే ఉన్నామని స్పష్టం చేశారు.