Vice President : ఇండియా కూటమి అభ్యర్థిగా ఇస్రో మాజీ శాస్త్రవేత్త!

ప్రతిపక్ష కూటమి ఇండియా ఇంకా తన అభ్యర్థిని వెల్లడించలేదు.అభ్యర్థి ఎంపికపై ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు కాంగ్రెస్ ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో పార్లమెంటులో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకుల సమావేశం జరగనుంది.

New Update
india

మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తన అభ్యర్థిగా ప్రకటించింది. కానీ ప్రతిపక్ష కూటమి ఇండియా ఇంకా తన అభ్యర్థిని వెల్లడించలేదు.అభ్యర్థి ఎంపికపై ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు కాంగ్రెస్ ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో పార్లమెంటులో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకుల సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కాగా 2022 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌ఖర్‌పై యూపీఏ కూటమి తరఫున మార్గరెట్ అల్వా పోటీ చేసి ఓడిపోయారు.

Also Read :  ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ వ్యక్తి

ఇస్రో మాజీ శాస్త్రవేత్త రేసులో

ఇండియా కూటమి నుంచి అనేక పేర్లను చర్చిస్తున్నారని టాక్. వీటిలో చంద్రయాన్-1 ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన ఇస్రో మాజీ శాస్త్రవేత్త మైలస్వామి అన్నాదురై పేరు కూడా ఉంది. తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది.  వీరితో పాటు మహాత్మా గాంధీ మునిమనవడు, చరిత్రకారుడు తుషార్ గాంధీ పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అలాగే మహారాష్ట్రకు చెందిన ఒక దళిత మేధావిని ఇండియా బ్లాక్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా కూడా పరిశీలిస్తున్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ సోమవారం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా,  అనేక మంది సీనియర్ బీజేపీ నాయకులు విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు.  ఢిల్లీ చేరుకున్న తర్వాత, రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిశారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో NDAకు పార్లమెంటులో స్పష్టమైన మెజారిటీ ఉంది. అందువల్ల, సీ.పీ. రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం దాదాపు ఖాయం. అయితే, ప్రతిపక్షాల నుంచి పోటీ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ జూలై 21న ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేయడంతో, భారత ఎన్నికల సంఘం కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 9 పోలింగ్ జరగనుంది.అదే రోజున కౌంటిగ్ జరుగుతుంది. 

వైఎస్ జగన్‌కు ఫోన్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి(YS Jagan) కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ(pm modi) సూచన మేరకు ఆయన ఈ కాల్ చేశారు. రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతివ్వాలని జగన్ ను రాజ్‌నాథ్‌ సింగ్‌ కోరారు. లోక్‌సభలో వైసీపీకి 4 ఎంపీలు,  రాజ్యసభలో వైసీపీకి ఏడుగురు సభ్యులున్నారు. కాగా గతంలో ఎన్డీఏ సూచించిన రాజ్యంగబద్దమైన  పదవులకు వైసీపీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించింది. అయితే ప్రస్తుతం  రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జగన్‌ తీసుకునే నిర్ణయంపై  సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

Also Read :  రైల్వే ప్రయాణీకులకు బిగ్ షాక్.. IRCTC బాదుడే బాదుడు

Advertisment
తాజా కథనాలు