Agniveer Scheme : మోదీ ప్రభుత్వం (Modi Government) తీసుకువచ్చిన అతి పెద్ద మార్పుల్లో డిఫెన్స్ సర్వీసుల ఉద్యోగ విధానాలు కూడా ఒకటి. ఇందులో అగ్నివీర్ (Agniveer) పేరుతో ఆర్మీ రిక్రూట్మెంట్స్ కోసం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, ఈ విధానం చాలా విమర్శల పాలైంది. దీనిలో ఉన్న నిబంధనల విషయంలో ఇటు నిరుద్యోగుల నుంచి అటు ప్రతిపక్షాల దాకా ఎన్నో విమర్శలు.. ఎంతో వ్యతిరేకత మూటగట్టుకుంది ఈ అగ్నివీర్ పథకం. ఇప్పుడు వీటన్నిటికీ తలొగ్గి మోదీ ప్రభుత్వం అగ్నివీర్ పథకం విషయంలో యూ టర్న్ తీసుకుంటున్నట్టు సమాచారం అందుతోంది. ఇప్పటికే దీని విధి విధానాలపై త్రివిధ దళాలలో అంతర్గతంగా ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వే నివేదిక ఆధారంగా పలు కీలక మార్పులను అగ్నివీర్ పథకంలో తీసుకురావడాన్నికి సన్నాహాలు చేస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ మార్పులు ఇలా ఉండవచ్చు..
పూర్తిగా చదవండి..Agniveer : అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మోదీ ప్రభుత్వ మరో యూ టర్న్!
మోదీ ప్రభుత్వం అగ్నివీర్ పథకంలో మార్పులు తీసుకురాబోతోందని తెలుస్తోంది. నాలుగేళ్లుగా ఉన్న పదవీ కాలాన్ని ఎనిమిది సంవత్సరాలకు పెంచదానికి సన్నాహాలు చేయనున్నట్లు తెలుస్తోంది. 25% మంది అగ్నివీర్ లను సాయుధ దళాల్లోకి తీసుకునే నిబంధనను 60 శాతానికి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
Translate this News: