Modi: ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఏన్డీఏ నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మోడీ అందించిన మిత్ర పక్షాల తీర్మానాన్ని పరిశీలించిన రాష్ట్రపతి.. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మోడీని ఆహ్వానించారు. జూన్ 9న మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణం చేయనున్నారు.