/rtv/media/media_files/2025/04/28/85MVPKwFITSx41AJ05L2.jpg)
Paka Venkata Satyanarayana
Rajya Sabha: ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం భర్తీపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. ఎన్డీయే అభ్యర్థిగా బీజేపీ నాయకుడు పాకా వెంకటసత్యనారాయణను అధిష్ఠానం ప్రకటించింది. ఆయన ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఒక స్థానం ఖాళీ అయ్యింది. మరో రెండేళ్ల పదవీ కాలం ఉన్న నేపథ్యంలో ఉపఎన్నికకు ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఈ స్థానం నుంచి అన్నామలై, స్మృతి ఇరానీ, మందకృష్ణమాదిగ పోటీ చేస్తారని ప్రచారం సాగినా చివరికి బీజేపీకి ఆ అవకాశం దక్కింది.
Also read : Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ గడువు ముగియనున్న నేపథ్యంలో.. భాజపా ఏపీ కోర్ కమిటీ సమావేశమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి యూరప్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. పాకా వెంకటసత్యనారాయణవైపు మొగ్గు చూపిన పార్టీ అధిష్ఠానం ..ఆయన్ని అభ్యర్థిగా ఖరారు చేసింది.
Also Read: పహల్గాం దాడిని పూర్తిగా షూట్ చేసిన వీడియోగ్రాఫర్.. కానీ
1961లో జన్మించిన ఆయన15 ఏండ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ లో చేరారు. ఆ తర్వాత ఏబీవీపీలోనూ పనిచేశారు. 1980 నుంచి బీజేపీలో పనిచేస్తున్నారు.ఆ తర్వాత 1981లో తొలిసారి బీమావరం మున్సిపాలిటీ కౌన్సిలర్ గా తొలిసారి గెలిచారు. అప్పుడు ఆయన వయస్సు కేవలం 20 సంవత్సరాలే కావడం విశేషం. అతిచిన్న వయసులోనే కౌన్సిలర్ గా ఎన్నికైన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత మరో రెండు సార్లు కూడా కౌన్సిలర్ గా గెలిచారు. ఆ తర్వాత పార్టీలో పలు పదవులు నిర్వహించారు. కాగా ప్రస్తుతం ఆయన ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. రేపు ఆయన కూటమి నాయకులతో కలసి నామినేషన్ వేస్తారు. కాగా ఆయన రాజ్యసభ సభ్యుడిగా రెండేళ్లు పదవిలో కొనసాగుతారు.
Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు
Also read: కాంగ్రెస్ వాళ్లను ఉరికిచ్చి కొడతా... ఎర్రబెల్లి దయాకర్ రావు ఫుల్ ఫైర్