Isarel:మళ్లీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 59 మంది పాలస్తీనీయులు మృతి
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా డెయిర్ అల్ బలాలో ఆహారం కోసం సహాయక కేంద్రం వద్ద ఉన్నవాళ్లపై కాల్పులకు దిగింది. ఈ దాడుల్లో 59 మంది పాలస్తీనీయులు మృతి చెందారు.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా డెయిర్ అల్ బలాలో ఆహారం కోసం సహాయక కేంద్రం వద్ద ఉన్నవాళ్లపై కాల్పులకు దిగింది. ఈ దాడుల్లో 59 మంది పాలస్తీనీయులు మృతి చెందారు.
హర్యాణాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారణి అయిన రాధికా యాదవ్ (25)ను కన్న తండ్రే కాల్చి చంపాడు. ఆమె సోషల్ మీడియాలో రీల్ చేయడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన హత్య చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ వ్యాధి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో 14,542 మంది మహిళల్లో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు బయటపడింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆమె మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిందని ఇంటర్నేషన్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) గురువారం అభియోగాలు మోపింది.
ఇటీవల ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీగా ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. దాదాపు 9 వేల మందికి పైగా లేఆఫ్ నోటీసులు పంపించింది. అయితే గతేడాది తమ కంపెనీ ఏఐ వల్ల రూ.4 వేల కోట్లు ఆదా చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది.
రాజస్థాన్‌లోని చురూ జిల్లాలో బుధవారం ఓ ఫైటర్ జెట్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. అయితే వీళ్లలో లోకేందర్ సింగ్ అనే పైలట్ నెల రోజుల క్రితమే తండ్రయ్యాడు. జూన్ 10న ఆయన భార్య మగ శిశువుకు జన్మనిచ్చింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక విషయం వెల్లడించారు. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక భవిష్యత్ ప్లాన్‌పై స్పష్టత ఇచ్చారు. వేదాలు, ఉపనిషత్తులు చదువుతానని తెలిపారు. అలాగే ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెడతానని తెలిపారు.
భారత్ నుంచి గ్రీస్ అత్యాధునిక లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ (LRLACM)ను కోరుతోంది. ఒకవేళ భారత్.. గ్రీస్‌కు ఈ క్షిపణిని ఇస్తే అది వ్యూహాత్మక చర్య కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో ముందడుగు వేసింది. సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్‌కు సంబంధించి రెండు హాట్ టెస్టులు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది. మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో జులై 3న ఈ పరీక్షలు నిర్వహించినట్లు ఇస్రో పేర్కొంది.