Cancer: ఆ ఒక్కచోటే 14,542 మంది మహిళల్లో క్యాన్సర్‌ లక్షణాలు

ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్‌ వ్యాధి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో 14,542 మంది మహిళల్లో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు బయటపడింది.

New Update
Cancer

Cancer

ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్‌ వ్యాధి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చాలామంది ఈ వ్యాధికి గురవుతున్నారు. కొందరు దీని నుంచి బయటపడితే మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో 14,542 మంది మహిళల్లో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు బయటపడింది. క్యాన్సర్ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు సంజీవని స్కీమ్‌లో భాగంగా అధికారులు స్క్రీనింగ్ టెస్ట్‌ జరిపారు. ఈ పరీక్షల్లో ఇది బయటపడినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకాస్ అబిత్కర్‌ తెలిపారు. 

Also Read: సోషల్ మీడియాలో ఇజ్జత్ తీసుకుంటున్న పాకిస్తాన్.. వీడియో వైరల్ చూడండి!

మహారాష్ట్ర అసెంబ్లీకి ఇచ్చిన లిఖిత పూర్వక ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. మార్చి 8 నుంచి 2,92,996 మందికి సర్వే నిర్వహించామని తెలిపారు. క్యాన్సర్ లక్షణాలకు సంబంధించి ఇచ్చిన ప్రశ్నపత్రానికి మహిళలు సమాధానాలిచ్చారన్నారు. వీళ్లలో 14,542 మంది మహిళలకు క్యాన్సర్ తరహా లక్షణాలు గుర్తించామని పేర్కొన్నారు. స్క్రీనింగ్, టెస్టుల తర్వాత ముగ్గురికి గర్భాశయ క్యాన్సర్, ఒకరికి రొమ్ము క్యాన్సర్, 8 మందికి నోటి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధరణ అయ్యిందని తెలిపారు. 

Also Read: ISSలో రైతుగా మారిన శుభాన్షు శుక్లా.. మట్టి లేకుండా వ్యవసాయమా..?

క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి చికిత్స చేసుకునేందుకు వీలుగా జిల్లా కలెక్టర్ చొరవతో ఈ కార్యక్రమం ప్రారంభించామని చెప్పారు. కానీ మహిళలకు ప్రత్యేక క్యాన్సర్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదన్నారు. క్యాన్సర్ నిర్ధరణ కోసం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, స్క్రీనింగ్‌లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు జిల్లా ఆస్పత్రులు, వైద్య కళాశాల ఆస్పత్రుల్లో క్యాన్సర్‌కు చికిత్స అందిస్తామన్నారు. ఇప్పటికే 8 జిల్లా ఆస్పత్రుల్లో డే కేర్‌ కీమోథెరపీ కేంద్రాలు ప్రారంభించామని.. అన్ని జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు