/rtv/media/media_files/2025/07/10/bangladesh-ex-pm-sheikh-hasina-2025-07-10-18-10-55.jpg)
Bangladesh ex-PM Sheikh Hasina formally indicted in crimes against humanity case
Sheikh Hasina:
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆమె మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిందని ఇంటర్నేషన్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) గురువారం అభియోగాలు మోపింది. దీనిపై ఆగస్టు 3న విచారణ జరగనుంది. ఈ విషయాన్ని ప్రాసిక్యూషన్ లాయర్ మీడియాకు వెల్లడింతారు. మజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు మాజీ హోం మంత్రి అసదుజ్జామన్ కాన్ కమల్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌధ్రీ అబ్దుల్లా అల్ మమున్‌పై ICT నేరాభియోగాలు మోపిందని తెలిపారు.
Also Read: సోషల్ మీడియాలో ఇజ్జత్ తీసుకుంటున్న పాకిస్తాన్.. వీడియో వైరల్ చూడండి!
గతేడాది జులై,ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఆమె ప్రయత్నాలు చేశారని ప్రాసిక్యూటర్ తెలిపారు. ఉద్యకారులను ఎక్కువ సంఖ్యలో చూపించడం, హింసించడం లాంటి నేరాభియోగాలు కూడా ఆమెపై ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఆగస్టు 3న జరగనున్న విచారణకు మమున్ మాత్రమే వ్యక్తిగతంగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఆ ఉద్యోగుల ఉసురు పోసుకుని.. 4 వేల కోట్లు మిగుల్చుకున్న మైక్రోసాఫ్ట్.. షాకింగ్ లెక్కలు!
ఇదిలాఉండగా ఉద్యమకారులను అణిచేయాలని షేక్ హసీనా ఆదేశించిన ఓ ఆడియో క్లిప్‌ను కూడా పశ్చిమ దేశాలకు చెందిన ఓ మీడియా సంస్థ బయటకీ తీసుకొచ్చింది. సీనియర్ పోలీసు అధికారికి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇక గతేడాది బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ అంశంపై మొదలైన నిరసనలు హింసాత్మక ఘటనలకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీంతో షేక్ హసీనా ప్రభుత్వంపై తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. చివరికీ ఆమె దేశం విడిచి పారిపోయింది. ఆ తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి షేక్ హసీనాపై అనేక కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆమె భారత్‌లోనే తలదాచుకుంటున్నారు.
Also Read: భార్య చేతిలో మరో భర్త బలి.. లవర్‌తో ఎంత దారుణంగా చంపించిందంటే..?
Also Read: భార్య చేతిలో మరో భర్త బలి.. లవర్‌తో ఎంత దారుణంగా చంపించిందంటే..?