/rtv/media/media_files/2025/07/10/radhika-yadav-2025-07-10-21-35-44.jpg)
Radhika Yadav, state-level tennis player, shot dead by father in Haryana's Gurugram
హర్యాణాలో దారుణం జరిగింది. ఓ టెన్నిస్ క్రీడాకారిణిని కన్న తండ్రే కాల్చి చంపడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారణి అయిన రాధికా యాదవ్ (25) గురుగ్రామ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది. గురువారం ఆమె ఇంట్లో వంట చేస్తోంది. ఈ సమయంలోనే తండ్రి దీపక్ యాదక్ వెనక నుంచి ఆమెపై తుపాకితో కాల్పులు జరిపాడు.
Also Read: ఆ ఒక్కచోటే 14,542 మంది మహిళల్లో క్యాన్సర్ లక్షణాలు
ఐదు రౌండ్లకు పైగా కాల్పులు జరిపాడు. దీంతో రాధిక ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే రాధిక సోషల్ మీడియాలో రీల్ చేయడంతో దీనిపై తండ్రితో వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన తండ్రి కూతురిని కాల్చి చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. మరోవైపు ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు.
Making reels became deadly :-
— Satyaagrah (@satyaagrahindia) July 10, 2025
Tennis player Radhika Yadav 🎾 was shot dead by her own father in Gurugram.
It is being told that Radhika's father was angry with Radhika for making reels on social media!!
He Shot 5 Bullets And Nearly 3 Stuck Into Her#TennisPlayer#RadhikaYadav… pic.twitter.com/6kelKt9gZs
Also read: 2029 నాటికి 40లక్షల HIV మరణాలు.. ఐరాస ఆందోళన