అలా చేయకుంటే స్థానిక ఎన్నికలు జరగనివ్వం.. కవిత సంచలన కామెంట్స్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకుంటే తాము ఎన్నికలు జరగనివ్వబోమని ఎమ్మె్ల్సీ కవిత తేల్చిచెప్పారు. రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించడంపై ఆలోచన చేయాలన్నారు. లేకపోతే నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు.