/rtv/media/media_files/2025/07/13/migrant-auto-driver-beaten-in-maharashtra-2025-07-13-16-34-07.jpg)
Migrant Auto Driver Beaten In Maharashtra
మహారాష్ట్రలో భాషా వివాదం ముదురుతోంది. ఇటీవల ఓ ఆటో డ్రైవర్ తనకు మరాఠీ రాదని.. హిందీనే మాట్లాడుతానని అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో తాజాగా ఉద్ధవ్, రాజ్ ఠాక్రే పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆ ఆటో డ్రైవర్‌పై దాడి చేశారు. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన ఓ వ్యక్తి ఆటో నడుపుతూ విరార్‌లో ఉంటున్నాడు.
Also Read: భారత్ అరుదైన ఘనత.. WHO నివేదికలో ప్రత్యేక గుర్తింపు
కొన్ని రోజుల క్రితం విరార్ స్టేషన్ దగ్గర్లో యూపీ నుంచి వలస వచ్చిన యువకుడు, ఆ ఆటో డ్రైవర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మరాఠీలో మాట్లాడాలని ఆ యువకుడు అడగగా దీనికి ఆ ఆటో డ్రైవర్ నిరాకరించాడు. నాకు మరాఠీ రాదు.. హిందీలో మాట్లాడుతా, భోజ్‌పురిలో మాట్లాడుతా అంటూ అరిచాడు. అయితే వీడియో క్లిప్ వైరల్ అయ్యింది.
Also Read: విదేశాల నుంచి భారీగా నిధులు..అక్రమంగా మతమార్పిడులు..చంగూర్‌బాబా కేసులో సంచలన విషయాలు
దీంతో శివసేన (UBT), మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS) కార్యకర్తలు శనివారం విరార్ స్టేషన్ సమీపంలో ఆ ఆటోడ్రైవర్‌ను అడ్డుకున్నారు. మరాఠీ భాషను అవమానిస్తావా అంటూ అతడిని కొట్టారు. మహిళా కార్యకర్తలు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. చివరికి అతడు క్షమాపణలు చెప్పాడు. మరోవైపు దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు.
Auto driver is beaten by Shivsena and MNS workers for disrespecting the Marathi language...#MarathiNews#marathilanguagerow#Virar#palghar#MBVVpolice@Dev_Fadnavis@DGPMaharashtrapic.twitter.com/mxkPYUES4L
— Indrajeet chaubey (@indrajeet8080) July 13, 2025