IMF: పాకిస్తాన్‌కు IMF బిగ్‌ షాక్.. మరో 11 షరతులు విధింపు

పాకిస్థాన్‌పై భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన తర్వాత అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) పాకిస్థాన్‌పై మరింత ఒత్తిడి తీసుకొస్తోంది. ఇందుకోసం మరో 11 ఆర్థికపరమైన షరతులు విధించింది.

New Update
IMF's Big Warning And 11 New Conditions For Pakistan After Operation Sindoor

IMF's Big Warning And 11 New Conditions For Pakistan After Operation Sindoor

పాకిస్థాన్‌పై భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన తర్వాత అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) పాకిస్థాన్‌పై మరింత ఒత్తిడి తీసుకొస్తోంది. తాజాగా అందిన నివేదికలో ఐఎంఎఫ్‌ పాకిస్థాన్‌పై మరో 11 కొత్త ఆర్థికపరమైన షరతులు విధించింది. దీనివల్ల వీటి మొత్తం షరతుల సంఖ్య 50కి చేరింది. ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం చూసుకుంటే పాకిస్థాన్‌ రాబోయే ఆర్థిక ఏడాదికి రక్షణ బడ్జెట్‌ను రూ.2.414 ట్రిలియన్‌కు పెంచాలని ప్లాన్ వేస్తోంది. గతేడాదితో పోలిస్తే 12 శాతం అంటే రూ.2.52 బిలియన్లు అధికం.   

Also Read: రాకెట్‌ ప్రయోగం ఫెయిలయితే.. ఉపగ్రహాల శకలాలు ఎక్కడ పడతాయో తెలుసా ?

మరోవైపు ఐఎంఎఫ్‌ సూచించిన గవర్నెన్స్‌ డయాగ్నొస్టిక్‌ అసెస్మెంట్‌ ఆధారంగా చూసుకుంటే ప్రభుత్వ బలోపేతం కోసం తీసుకునే చర్యల ప్లాన్‌ను ప్రభుత్వం ప్రచురించాలి. అలాగే 2027 తర్వాత ఆర్థిక రంగ పాలన, నియంత్రణ గురించి ప్లాన్ తయారుచేయాలి. ఎనర్జీ రంగంలో కొత్త షరతులు కూడా తీసుకురావాలని చెప్పింది. అలాగే 2026, ఫిబ్రవరి 15 నాటికి గ్యాస్ ఛార్జీలను సవరించాలని.. మే నెలాఖరులోగా ఈ ఆర్డినెన్స్‌ను శాశ్వత చట్టంగా మార్చాలంది. ప్రస్తుతం ఉన్నటువంటి రూ.3.21 యూనిట్‌ పరిమితిని జూన్‌ లోపు తొలగించాలని పేర్కొంది.

Also Read: పాక్ వ్యక్తితో రిలేషన్.. ఇండియన్ అధికారులకు వలపు వల.. జ్యోతి వ్యవహారంలో సంచలన విషయాలు!

అంతేకాదు 2035 నాటికి ప్రత్యేక పార్కులను ఇచ్చే రాయితీలను పూర్తిగా తొలగించాలని IMF కోరింది. ఇందుకోసం ఈ ఏడాది చివరిల్లోగా రిపోర్టు సమర్పించాలని చెప్పింది. అలాగే జులై చివరి నాటికి, వాణిజ్య ప్రయోజనాల కోసం 5 ఏళ్ల లోపు వాడిన కార్ల దిగుమతికి పర్మిషన్‌ను చట్టసభకు సమర్పించాలని తెలిపింది. 

Also Read: గుల్జారీ హౌజ్ అగ్ని ప్రమాదం.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక ప్రకటన

telugu-news | rtv-news | national-news | india-pakistan

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు