E-Commerce: అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌కు బిగ్ షాక్.. కేంద్రం నోటీసులు

భారత్‌లో ఈ కామర్స్‌ సేవలందిస్తున్న అమెజనా, ఫ్లిప్‌కార్డ్‌ సహా పలు కంపెనీలకు కేంద్రం నోటీసులు పంపించింది. పాకిస్థాన్‌కు చెందిన జెండాలు, ఆ దేశ వస్తువులను ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Update
Amazon, Flipcart

Amazon, Flipcart

భారత్‌లో ఈకామర్స్‌ సేవలందిస్తున్న అమెజనా, ఫ్లిప్‌కార్డ్‌ సహా పలు కంపెనీలకు బిగ్ షాక్ తగిలింది. ఈ సంస్థలు పాకిస్థాన్‌కు చెందిన జెండాలు, ఆ దేశానికి చెందిన వస్తువులను ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో కేంద్రం వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (CCPA) స్పందించింది. ఈ కామర్స్‌ చేస్తున్న ఈ పనులు జాతీయ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ధ్వజమెత్తింది. ఈ నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సహా వివిధ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. 

Also Read: భారత్‌తో యుద్ధం చేసేందుకు చైనాతో కలిసి పాక్‌ కుట్ర !

Centre Cracks Down On E-Commerce Sites

ఆయా సంస్థల ఉత్పత్తులను ఆన్‌లైన్‌ నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించింది. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌,ది ఫ్లాగ్ కార్పొరేషన్, ది ఫ్లాగ్ కంపెనీ, యూబై ఇండియా వంటి పలు ఈ కామర్స్‌ సంస్థలకు నోటీసులు పంపించామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ ప్రకటన చేశారు. 

Also Read: విద్యార్థులను అక్కడ తాకుతూ.. అరచేతిపై ఫోన్ నంబర్‌ రాసి చివరికి - ప్రొఫెసర్ అరాచకం!

''పాకిస్థాన్‌కు చెందిన జెండాలు, వస్తువులు ఈ కామర్స్‌లో అమ్మడం అంటే దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుంది. ఇలా సున్నితమైన విషయాలను సంహించం. ఈ కామర్స్ సంస్థలు వెంటనే వాటిని తొలగించాలి. జాతీయ చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలంటూ'' రాసుకొచ్చారు. 

Also Read: దేశ సైన్యం మోదీ పాదాలకు నమస్కరిస్తుంది.. డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు: VIDEO

Also Read: పాకిస్తాన్ నుండి విడిపోవడం అంత ఈజీ కాదు.. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా మారాలంటే ఏం చేయాలి?

\

 rtv-news | Flipcart | national-news

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు