/rtv/media/media_files/2025/05/18/kPFjP2qMV7PJApOq6UyH.jpg)
Indian Army posts a video of Operation Sindoor on its social media handle 'X'
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చల్లారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇండియన్ ఆర్మీ ఎక్స్‌లో మరో సంచలన వీడియో విడుదల చేసింది. ఇది రివేంజ్ కాదు.. న్యాయం మాత్రమే అంటూ క్యాప్షన్ ఇచ్చింది. పాకిస్థాన్‌పై దాడులను పక్కగా ప్లాన్ చేసి.. శిక్షణ తీసుకొని, అమలు చేశామని ట్వీట్ చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ప్రతి శత్రుస్థావరాన్ని నాశనం చేశామని ఇండియన్ ఆర్మీ తెలిపింది.
#WATCH | Western Command - Indian Army posts a video of Operation Sindoor on its social media handle 'X'.
— ANI (@ANI) May 18, 2025
"Planned, trained & executed. Justice served"- Indian Army pic.twitter.com/Z3SwvGS1j3
Also Read: పాక్ వ్యక్తితో రిలేషన్.. ఇండియన్ అధికారులకు వలపు వల.. జ్యోతి వ్యవహారంలో సంచలన విషయాలు!
ఇదిలాఉండగా పాక్ లోని ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపిన భారత ఆర్మీని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర సమయంలో ఆయుధాలను కొనుగోలు చేసే అధికారాలను ఆర్మీకే అప్పగించింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అత్యవసర సమయాల్లో నేరుగా కొనేలా రక్షణ దళాలకు అధికారం కట్టబెట్టింది. రూ. 40 వేల కోట్ల విలువైన ఆయుధాలను కొనుగోలు చేయనుంది.
Also Read: రాకెట్ ప్రయోగం ఫెయిలయితే.. ఉపగ్రహాల శకలాలు ఎక్కడ పడతాయో తెలుసా ?
దీంతో పాటూ కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు ఆర్మీకి ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ ఫలితంగా భారత రక్షణ బడ్జెట్ మరో రూ.50,000 కోట్లు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రక్షణ రంగంలో భారత్‌ను మరింత పటిష్టం చేసేందుకు మోదీ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఆర్మీకి కొత్త వెపన్స్, మందుగుండు సామాగ్రి కొనుగోలు చేయనున్నట్లు సమాచారం.2025–26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రక్షణ శాఖకు కేటాయింపులు రూ.7 లక్షల కోట్లకు మించిపోతాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బడ్జెట్ కు ఆమోదం కోరే అవకాశం ఉంది.
Also Read: కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్...50,000 డాలర్ల బహుమతి
telugu-news | rtv-news | national-news