Jyothi Malhotra: మాయలేడి జ్యోతి.. పాక్‌ డబ్బుతో టూర్లు, లగ్జరీ హోటల్స్‌లో విలాసం

జ్యోతి మల్గోత్రా పాకిస్తాన్ డబ్బుతోనే విదేశీ పర్యటన చేసిందని, లగ్జరీ హోటల్స్‌లో గడిపిందని విచారణలో తేలింది. భారత ఆర్మీ సున్నిత సమాచారాన్ని వాట్సాప్, టెలిగ్రామ్‌, స్నాప్‌చాట్‌ ద్వారా ఆమె పాక్‌కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు.

New Update
Jyothi Malhotra Spent Pakistan Money on Foreign tours, luxury hotels

Jyothi Malhotra Spent Pakistan Money on Foreign tours, luxury hotels

పాకిస్థాన్‌ కోసం గూఢచర్యం చేస్తూ అరెస్టయిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్ర కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆమెకు సంబంధించి మరో సంచలన అప్‌డేట్‌ వచ్చింది. జ్యోతి పాకిస్తాన్ డబ్బుతోనే విదేశీ పర్యటన చేసిందని, లగ్జరీ హోటల్స్‌లో గడిపిందని విచారణలో తేలింది. భారత ఆర్మీ సున్నిత సమాచారాన్ని ఆమె పాక్‌కు చేరవేసింది. టూర్స్‌ పేరుతో  గూఢచర్యం చేసిన జ్యోతి.. పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులతో పలుమార్లు సంప్రదింపులు జరిపింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్‌ ద్వారా సమాచారం చేరవేసినట్లు తేలింది. ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :  ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన గుజరాత్‌

Jyothi Malhotra Spent Pakistan Money

Also Read: జమ్మూకశ్మీర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు

పహల్గాం ఉగ్రదాడికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రదేశానికి వెళ్లినట్లు విచారణలో తేలింది. అలాగే ఈ దాడికి ముందు పాకిస్థాన్‌లో చాలాసార్లు పర్యటించిందని.. ఓసారి చైనాకు కూడా వెళ్లొచ్చిందని పోలీసులు తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ ఎంబసీ అధికారి డానిష్‌తో టచ్‌లో ఉన్నట్లు తేలింది. ఆమెను అతడు ట్రాప్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Also Read: ఆపరేషన్ సిందూర్‌పై సంచలన వ్యాఖ్యలు.. యూనివర్సిటీ ప్రొఫెసర్ అరెస్ట్

అంతేకాదు ఆమెకు పాక్‌ ఆర్మీ,  ఐఎస్‌ఐ  అధికారులతో కూడా సంబంధాలు ఉన్నట్లు తేలింది. అలాగే జ్యోతి జాడలు ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా వెలుగుచూశాయి. 2023 సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ హైదరాబాద్‌-బెంగళూరు వందేభారత్‌ రైలును ప్రారంభించారు. ఆ సమయంలో ఆమె హడావుడి చేశారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ అలాగే అప్పటి గవర్నర్‌ తమిళసై పాల్గొన్న కార్యక్రమంలో జ్యోతి ఉన్నారు. ఆ సమయంలో యూట్యూబర్‌గా వీడియోలు చేస్తూ హల్‌చల్ చేశారు. అయితే ఆమెకు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వచ్చే డబ్బులు సరిపోకపోవడంతోనే ఇలా డబ్బలకు కక్కుర్తిపడి భారత సమాచారాన్ని పాక్‌కు చేరవేసినట్లు తెలుస్తోంది. 

Also Read: కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్...50,000 డాలర్ల బహుమతి 

 telugu-news | national-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు