/rtv/media/media_files/2025/05/18/tBVSHLJlCumpufjFJtYO.jpg)
Probe underway into links between Odisha YouTuber and 'Pak spy' Jyoti Malhotra, Police
భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాక్ నిఘా సంస్థలకు అందిస్తోందనే ఆరోపణపై హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఆమెపై విచారణ మొదలుపెట్టారు. ఆమెకు ఒడిశాలోని పూరీకి చెందిన మరో యూట్యూబర్‌తో ఉన్న సంబంధంపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె గతేడాది సెప్టెంబర్‌లోలో పూరీకి వచ్చారని.. అక్కడ మరో యూట్యూబర్‌ను కలిసినట్లు గుర్తించామని ఒడిశా పోలీసులు తెలిపారు. పూరీకి చెందిన ఆ యూట్యూబర్ ఇటీవల పాక్‌లోని కర్తర్‌పుర్ సాహిబ్ గురుద్వారాకు వెళ్లినట్లు చెప్పారు.
జ్యోతీ పూరికి రావడానికి కారణం ?
ఒడిశాలోని ఎస్పీ వినీత్ అగర్వాల్ జ్యోతి గురించి ఆదివారం మీడియాకు వెల్లడించారు. జ్యోతి గతేడాది పూరీకి వచ్చినట్లు మా దర్యాప్తులో తేలిందని తెలిపారు. వాస్తవాల ఏంటనే దానిపై పరిశీలన చేస్తున్నామన్నారు. అయితే జ్యోతితో పూరీకి చెందిన మహిళ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకుందా అని అడగగా.. ఈ కేసుపై హర్యానా పోలీసులు విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ఆమె పూరీ కావడానికి గల కారణం, అక్కడికి వచ్చాక ఎక్కడ తలదాచుకుంది, ఎవరిని కాంటాక్టు అయ్యింది అనే విషయాలు తెలుసుకునేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. కానీ పూరీకి చెందిన ఆ యూట్యూబర్ గురించి పోలీసులు సంబంధిత వివరాలు వెల్లడించలేదు. అయితే పాక్ హై కమిషన్‌లో పనిచేసే ఉద్యోగి ఇషాన్ ఉర్ రహీమ్ అలియస్ ధనూష్‌ని జ్యోతి కలిసిన ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది.
पाकिस्तान में मरियम नवाज़ से मिली थीं Jyoti Malhotra
— News24 (@news24tvchannel) May 17, 2025
◆ ज्योति ने पाकिस्तान उच्चायोग के कर्मचारी एहसान उर रहीम उर्फ दानिश से मुलाकात की थी
◆ ज्योति को कोर्ट ने 5 दिन की न्यायिक हिरासत में भेजा
कर्मचारी दानिश || पाक हाई कमीशन || ज्योति मल्होत्रा || Spy #JyotiMalhotra pic.twitter.com/Kr7Jd3konc
Also Read: రాకెట్ ప్రయోగం ఫెయిలయితే.. ఉపగ్రహాల శకలాలు ఎక్కడ పడతాయో తెలుసా ?
మరోవైపు పూరీకి చెందిన యూట్యూబర్ తండ్రి దీనిపై మాట్లాడారు. '' నా కూతురుతో జ్యోతికి పరిచయం ఏర్పడింది. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. కాబట్టి దర్యాప్తు సరైన దారిలో జరగాలి. పోలీసులకు మేము సహకరిస్తాం. 3-4 నెలల క్రితం తీర్థయాత్రలో భాగంగా పాక్‌లోని కర్తార్‌పుర్‌కు మా కూతురు వెళ్లింది. కానీ జ్యోతీతో కాదు. మరో ఫ్రెండ్‌తో అక్కడికి వెళ్లింది. ఆమె దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనలేదు. అసలు జ్యోతి గూఢచర్యం చేస్తుందనే విషయం ఆమెకు తెలియదని'' పూరీ యూట్యూబర్ తండ్రి వివరించారు.
Also Read: పాక్ వ్యక్తితో రిలేషన్.. ఇండియన్ అధికారులకు వలపు వల.. జ్యోతి వ్యవహారంలో సంచలన విషయాలు!
ఇదిలాఉండగా ఈ వ్యవహారంపై పూరీ యూట్యూబర్ ఇన్‌స్టాలో స్పందించారు. '' జ్యోతి నాకు స్నేహితురాలు మాత్రమే. నేను యూట్యూబ్ ద్వారానే కలిశాను. ఆమెపై వస్తున్న ఆరోపణల గురించి నాకు తెలియదు. జ్యోతి పాకిస్థాన్‌తో గూఢచర్యం చేస్తుందని తెలిస్తే ఆమెతో నేను కాంటాక్ట్‌లో ఉండేదాన్ని కాదు. ఏదైన దర్యాప్తు సంస్థ నన్ను విచారించాలనుకుంటే నేను సహకరిస్తాను. దేశమే అన్నిటికంటే గొప్పదని'' ఆమె పోస్ట్ చేశారు.
rtv-news | JYOTHI MALHOTRA | national-news | telugu-news