/rtv/media/media_files/2025/05/18/DFEtzG10HPIJTt7QCBPe.jpg)
Russia launches one of biggest drone attacks on Ukraine since start of war
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. ఏకంగా ఒకేసారి వందలాది డ్రోన్లు ప్రయోగించింది. ఇరుదేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా జరిగిన అదిపెద్ద దాడుల్లో ఇదొకటని ఉక్రెయిన్ వర్గాలు చెబుతున్నాయి. యుద్ధ ముగింపునకు సంబంధించి టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా ఇరుదేశాల ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు ఇటీవలే జరిగాయి. ఇది జరిగిన కొన్నిరోజులకే మళ్లీ భారీ దాడులు జరగడం కలకలం రేపుతోంది.
Also Read: రాకెట్ ప్రయోగం ఫెయిలయితే.. ఉపగ్రహాల శకలాలు ఎక్కడ పడతాయో తెలుసా ?
దొనెట్స్క్, నిప్రోపెట్రోవ్స్క్, కీవ్ తదితర ప్రాంతాల్లో రష్యా దాడులకు దిగింది. 273 ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది. అయితే వాటిలో 88 డ్రోన్లను కూల్చేశామని ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద డ్రోన్ దాడని తెలుస్తోంది. గతంలో రష్యా ఒకేసారి 267 డ్రోన్లు ప్రయోగించింది. అయితే తాజాగా జరిగిన దాడుల్లో కీవ్‌లో ఓ మహిళ మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లను కూడా కూల్చివేశామని రష్యా తెలిపింది.
Also Read: కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్...50,000 డాలర్ల బహుమతి
ఇదిలాఉండగా యుద్ధానికి కారణమైన అంశాలకు ముగింపు పలకడం, ఇరుదేశాల మధ్య శాంతి కోసం పరిస్థితులను సృష్టించడం వంటివి తమ లక్ష్యాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదివారం ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వకపోవడం, క్రిమియాతో పాటు మరో నాలుగు ప్రావిన్స్‌లు తమకు చెందుతాయని అంగీకరించడం వంటి నెరవేర్చాలని రష్యా మొదటినుంచి డిమాండ్ చేస్తోంది.
Also Read: పాక్ వ్యక్తితో రిలేషన్.. ఇండియన్ అధికారులకు వలపు వల.. జ్యోతి వ్యవహారంలో సంచలన విషయాలు!
Also Read: మిస్ వరల్డ్ స్పోర్ట్స్ విజేతగా ఎస్తోనియా భామ ఎలిస్ రాండ్మా
russia-ukraine | telugu-news | rtv-news | national-news