Terrorists: మరో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్‌

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట కొనసాగుతూనే ఉంది. అయితే లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను తాజాగా జమ్మూకశ్మీర్‌ పోలీసులు అరెస్టు చేశారు. బడ్గాం జిల్లాలో వీళ్లని అదుపులోకి తీసుకున్నారు.

New Update
Three Terrorists linked to Lashkar-e-Taiba Arrested in Jammu kashmir

Three Terrorists linked to Lashkar-e-Taiba Arrested in Jammu kashmir

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌ ఘటనలు భారత్‌ వైపు ప్రపంచ దేశాలు చూసేలా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట కొనసాగుతూనే ఉంది. అయితే లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను తాజాగా జమ్మూకశ్మీర్‌ పోలీసులు అరెస్టు చేశారు. బడ్గాం జిల్లాలో ఈ అరెస్టులు జరిగాయి. వాళ్లు ఆ ప్రాంతంలో ఉగ్రకార్యక్రమాలకు యత్నిస్తున్నారని పక్కా సమాచారం అందింది. 

Also Read: దేశ సైన్యం మోదీ పాదాలకు నమస్కరిస్తుంది.. డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు: VIDEO

Three Terrorists Linked To Lashkar E Taiba

అలాగే ఆ ఉగ్రవాదులు తమ గ్రూప్‌లోకి చేర్చుకునేందుకు స్థానికులను యత్నిస్తున్నారని తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాళ్లని అరెస్టు చేశారు. నిందితులు ముజామిల్ అహ్మద్‌, ఇష్ఫక్ పండిట్, మునీర్‌ అహ్మద్‌గా గుర్తించారు. వాళ్ల దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకున్నారు. ఈ ముగ్గురికి కూడా లష్కరే తోయిబా ఉగ్రవాది ఆబిద్‌ కయ్యూమ్‌తో సంబంధాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. 

Also Read: ‘వెండి గాజుల్లో వాటా ఇచ్చి తల్లి అంత్యక్రియలు జరపండి’.. చిన్న కొడుకు చిల్లర పంచాయితీ

మరోవైపు గత 3 రోజుల్లోనే ఆరుగురు ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. పుల్వామా జిల్లాలో థ్రాల్‌ ప్రాంతంలోని ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. నాదిర్‌ గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టగా.. ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు చేయగా.. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. ఇక మంగళవారం షోపియాన్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో మరో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. 

Also Read: ఐస్ క్రీంలో బల్లి తోక.. కట్ చేస్తే రూ.50,000 ఫైన్ - వీడియో చూశారంటే?

Also Read: పాకిస్తాన్ నుండి విడిపోవడం అంత ఈజీ కాదు.. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా మారాలంటే ఏం చేయాలి?

Pahalgam attack | national-news | operation Sindoor

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు