/rtv/media/media_files/2025/05/18/NxTkj5BNbpatEWktKSqH.jpg)
Abu Saifullah, key LeT commander behind major attacks in India, killed in Pakistan
లష్కరే తోయిబా కీలక కమాండర్ అబు సైఫూల్లా హతమయ్యాడు. పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అతడిని కాల్చి చంపారు. సైఫుల్లా భారత్‌లో మూడు ఉగ్రదాడులకు సూత్రధారిగా ఉన్నాడు. ఉగ్ర సంస్థలో నియామకాలు, ఆర్థిక వ్యవహారాలు, లాజిస్టిక్స్, ఇండోనేపాల్ సరిహద్దులో ఆపరేటివ్ కదలికలు సంబంధించిన వ్యవహారాల్లో అతడు పాల్గొంటాడనే ఆరోపణలు ఉన్నాయి.
Also Read: జ్యోతికి పాకిస్తాన్ ఆర్మీతో సంబంధాలు.. వెలుగులోకి సంచలన నిజాలు
లష్కరే తోయిబా గ్రూప్ చీఫ్ అకౌంటెంట్ యాకూబ్‌తో కలిసి అతడు పనిచేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.సైఫుల్లా వినోద్ కుమార్ అనే పేరుతో కార్యకలాపాలు నిర్వహించాడని.. నేపాలీకి చెందిన నగ్మా బాను అనే మహిళను వివాహం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నేపాల్‌లో ఉంటూనే అతడు ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించేవాడని పేర్కొన్నాయి.
Also Read: పాక్ గూఢచారి.. యూట్యూబర్ మల్వోత్రా గురించి ఈ 5 విషయాలు తెలిస్తే షాక్ అవుతారు!
ముఖ్యంగా ఉగ్ర కార్యకలాపాలకు కేడర్‌ను తీసుకురావడం, ఆర్థిక సాయం అందించడంలో అతడు కీలకంగా ఉండేవాడు. 2006లో ఆర్ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంపై దాడి, 2001లో రాంపూర్‌లో CRPF శిబిరంపై, 2005లో బెంగళూరులో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ISC)పై దాడుల వెనుక సైఫుల్లా హస్తం ఉన్నట్లు బయటపడింది. వీటితో పాటు అనేక దాడులకు అతడు కుట్రకు పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read: కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్...50,000 డాలర్ల బహుమతి
Also Read: ఆ చిన్న తప్పు 17 మంది ప్రాణాలు తీసింది.. గుల్జార్‌హౌస్ ప్రమాదంపై సంచలన ప్రకటన!
national-news | lashkar-e-taiba | Lashkar-e-Taiba commander | rtv-news