Eknath Shinde : రక్తానికి రక్తంతోనే ప్రతీకారం... ఆ నా కొడుకులను మోడీ వదలడు.. ఏక్ నాథ్ షిండే సంచలన కామెంట్స్
ఉగ్ర దాడిపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కీలక ప్రకటన చేశారు. ఈ దాడి చాలా దురదృష్టకరమని; ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పొరుగు దేశం పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రక్తానికి రక్తంతో ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు.
Bandi Sanjay : తుపాకీ పట్టినోడు ఆ తుపాకికే బలవుతాడు: బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్గాం ఘటన అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తుపాకీ పట్టినోడు చివరకు ఆ తుపాకీకే బలికాక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
Indus Waters : మిస్టర్ మోదీ..సింధూలో నీళ్లు పారకపోతే రక్తం పారుతుంది: బిలావల్ భుట్టో హెచ్చరిక
పాక్ మాజీ విదేశాంగశాఖ మంత్రి బిలావల్ భుట్టో భారత్‌పై నోరు పారేసుకున్నారు. సుక్కూర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. తన బలహీనతను కప్పి పుచ్చుకోవడానికి, ప్రజలను మోసం చేయడానికి భారత ప్రధాని మోదీ పాక్‌ను నిందిస్తున్నారని భుట్టో వాపోయారు.
MLA Aminul Islam : పహల్గాం దాడి వెనుక మోదీ, అమిత్ షా కుట్ర.. అస్సాం ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు ఉన్నారంటూ అస్సాం ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం సంచలన ఆరోపణలు చేశారు. 2018లో కూడా పుల్వామా దాడిలో కూడా కేంద్రం పాత్ర ఉందని తాను నమ్ముతున్నానని అన్నారు.
PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ
ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం లభించింది. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయక మిత్ర విభూషణ పతకంతో ఆయన్ని సత్కరించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగు పరచడానికి కృషి చేసినందుకు మోదీకి శ్రీలంక ప్రభుత్వం ఈ అవార్డ్ ప్రకటించింది.
Bandi Sanjay: బండి సంజయ్ నోట.. మోదీ పాట.. వీడియో వైరల్!
ఎప్పుడూ సీరియస్ గా కనిపించే బీజేపీ నేత బండి సంజయ్.. సింగర్ గా మారారు. నమో.. నమో.. నరేంద్ర మోదీ.. అంటూ పాట పాడారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Eatala Rajendar: ఫ్యామిలీతో వెళ్లి ప్రధానికి కలిసిన ఈటల.. ఆ పదవి ఫిక్స్ అయినందుకేనా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ బీజేపీ కీలక నేత, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ రోజు కుటుంబ సమేతంగా కలిశారు. ఈటల మనవడికి ప్రధాని స్వయంగా చాక్ లెట్స్ అందించారు. తెలంగాణ అధ్యక్ష పదవి ఫిక్స్ అయిందని.. అందుకే ప్రధానిని ఈటల కలిశారన్న ప్రచారం సాగుతోంది.
Fight Obesity: రజినీకాంత్, చిరు, మమ్ముట్టిని నామినేట్ చేసిన మోహన్ లాల్.. ఎందుకంటే?
'మన్ కీ బాత్' కార్యక్రమంలో మోదీ ఊబకాయంపై పోరులో తన పేరును నామినేట్ చేయడం పై నటుడు మోహన్ లాల్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హెల్తీ ఇండియాను నిర్మిద్దాం అంటూ తాను కూడా మరో పది మందిని నామినేట్ చేశారు. చిరు, రజినీ, మమ్ముట్టి తదితరులను నామినేట్ చేశారు.