Netaji Subhas Chandra Bose: మా నాన్న అస్థికలు తెప్పించండి ఫ్లీజ్‌: ప్రభుత్వాన్ని కోరిన నేతాజీ కుమార్తె

స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ మరణం నేటికి మిస్టరీనే. అయితే ఆయన మరణం తర్వాత నేతాజీ అస్థికలు టోక్యోలోని రెంకో-జీ గుడిలో భద్రపరిచారని చెబుతారు. ఆ అస్థికలను భారత్‌కు తీసుకురావాలని నేతాజీ కూతురు అనితా బోస్‌ కేంద్రానికి కీలక విజ్ఞప్తి చేశారు.

New Update
Please bring back my father's ashes: Netaji's daughter asks government

Please bring back my father's ashes: Netaji's daughter asks government

Netaji Subhas Chandra Bose:

స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ ముఖ్య నేత నేతాజీ సుభాష్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన మరణం నేటికి మిస్టరీనే. అయితే ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించారని పలువురు పరిశోధకులు తెలిపారు. కానీ, ఇంతవరకు ఆయన మరణానికి సంబంధించిన కీలక ఆధారలేవి లేవు. అయితే ఆయన మరణం తర్వాత నేతాజీ అస్థికలు టోక్యోలోని(tokyo) రెంకో-జీ గుడిలో భద్రపరిచారని చెబుతారు. ఈ విషయమై నేతాజీ కూతురు అనితా బోస్‌ కేంద్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల పర్యటన కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌కు(japan)  వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ దేశంలోని రెంకోజి ఆలయంలో భద్రపరిచారని చెబుతున్న స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్  అస్థికలను భారత్‌కు తీసుకురావాలని ఆయన కుమార్తె కోరారు.

Also Read: అమిత్ షా తల నరికి టేబుల్ మీద పెట్టాలి.. TMC ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ఇటీవలె అనగా ఆగస్టు 18 న నేతాజీ 80వ వర్ధంతిని నిర్వహించారు. అయితే 1945 ఆగస్టు 18న తైపీ నగరంలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారని చెబుతారు. అందుకే ఆగస్టు 18న ఆయన వర్ధంతిని నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా నేతాజీ వర్ధంతికి ముందు రోజు.. ఆయన కుమార్తె అనితా బోస్ తన తండ్రి అస్థికలను భారత్‌కు రప్పించాలని ప్రభుత్వాన్ని కోరడం విశేషం.

ఈ సందర్భంగా అనితా బోస్ మాట్లాడుతూ.. తాను చాలాకాలం నుంచి  తన తండ్రి అస్థికలను ఇండియాకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నానని తెలిపారు. టోక్యోలోని రెంకో-జీ గుడిలో భద్రపరిచిన అస్థికలు తన తండ్రి నేతాజీవేనని పలువురు నమ్ముతున్నారని ఆమె తెలిపారు. అందుకే వాటిని ఇండియాకు తీసుకువచ్చి డీఎన్ఏ పరీక్ష చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలానే తన తండ్రి నేతాజీ మరణం చుట్టూ ఉన్న వివాదాలను పరిష్కరించాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు. తన తండ్రి మరణం చుట్టూ అల్లుకున్న ఆరోపణలకు.. శాస్త్రీయ ఆధారాలతో ముగింపు పలకాలని.. అలానే తన తండ్రి జ్ఞాపకాలను సరైన రీతిలో గౌరవించాలని కోరారు. తన తండ్రి అస్థికలను ఇండియాకు రప్పించడమే తన చిరకాల వాంఛ అని అమె స్పష్టం చేశారు.  అయితే నేతాజీకి ఆయన పురిటిగడ్డ భారతదేశంలోనే అంతిమ వీడ్కోలు పలకాలని అనితా బోస్ కోరుకుంటున్నారు. వయసు రీత్యా ప్రస్తుతం వాటిని తిరిగి పొందడం తనకు అత్యంత ముఖ్యమన్నారు. ఈ అంశంపై తాను ముగింపు కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సమస్యను తన పిల్లలు వారసత్వంగా పొందాలనుకోవడం లేదన్నారు.  ఆయన చితాభస్మాన్ని ప్రజలందరూ చూసి నివాళులు అర్పించాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు. అలా జరగాలంటే నేతాజీ అస్థికలను ఇండియాకు తెప్పించాలని ఆమె చాలాకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  

Also Read:Karimnagar : ఎంత మంది గోసనో.. ఏసీబీకి దొరికిన పంచాయతీ కార్యదర్శి.. ఊర్లో సంబరాలు!

నేతాజీ తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారని కొందరు చెబుతారు. కానీ కొంతమంది  మాత్రం ఆయన బతికే ఉన్నారని.. అజ్ఞాతంలో జీవించారని చెబుతారు. చంద్రబోస్ మరణంపై నేటికి కూడా సమాజంలో అనేక రకాల అనుమానాలున్నాయి. నేతాజీ 1945 ఆగస్టు 18న టోక్యోకు  విమానంలో వెళ్తుండగా.. తైపీ నగరంలోని తైహోకు చేరుకున్న సమయంలో  నేతాజీ  ప్రయాణీస్తున్న విమానం కూలిపోయింది. ఆ ప్రమాదంలో ఆయన చనిపోయారని చాలా మంది నమ్ముతారు. తైపీలోనే నేతాజీ అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన అస్థికలను టోక్యోకు తరలించారు. అప్పటికీ మన దేశానికి స్వాతంత్ర్యం రాకపోవడంతో జపాన్‌లో ఉన్న భారతీయుల అభ్యర్థన మేరకు రెంకో-జీ ఆలయ ప్రధాన పూజారి.. కొంతకాలం  పాటు నేతాజీ అవశేషాలను సంరక్షించడానికి ఒప్పుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేతాజీ అస్థికలు అక్కడే ఉన్నాయి. రెంకో-జీ ఆలయం ప్రస్తుత తరం ప్రధాన పూజారులు నేటికి నేతాజీ అవశేషాలను  సంరక్షిస్తున్నారు.

నేతాజీ మరణంపై  అనుమానాల నేపథ్యంలో భారత ప్రభుత్వం  రెండు దర్యాప్తు కమిషన్‌లు వేసింది. ఆ రెండు కూడా ఆయన తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు చెప్పాయి. కానీ,  జస్టిస్‌ ఎంకే ముఖర్జీ నేతృత్వంలోని కమిషన్‌ మాత్రం వాటిని తోసిపుచ్చింది. ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా నేతాజీ బతికే ఉన్నారని పేర్కొంది. దీంతో నేతాజీ మరణం, రెంకోజీ ఆలయంలో ఉన్న అస్థికలు నేతాజీవా? కావా? అన్న విషయం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. 

Also Read: CM Revanth Reddy : మేడిగడ్డ కూలింది. ఎల్లంపల్లే మనకు దిక్కు..సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు