/rtv/media/media_files/2025/07/06/pm-kisan-2025-07-06-17-13-31.jpg)
జూలై నెల ఇప్పటికే ప్రారంభమైంది. కానీ ప్రధానమంత్రి -కిసాన్ సమ్మాన్ నిధికి 20వ విడత డబ్బులు మాత్రం ఇంకా రైతుల ఖాతాల్లో జమ కాలేదు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు రూ. 2 వేల నగదు కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో ఎప్పుడైనా ఈ డబ్బులను విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 20న బీహార్‌లోని మోతిహరి పర్యటనకు వెళ్లనున్నారు. జూలై 18న 20వ విడతను విడుదల చేయవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు నుంచి సమాచారం తెలుస్తోంది.
చిన్న సన్నకారు రైతులకు
రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి కేంద్రం ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని 2019 సంవత్సరంలో తీసుకువచ్చింది. ఈ పథకం కింద, చిన్న సన్నకారు రైతులు సంవత్సరానికి రూ. 6,000 చొప్పున మూడు వాయిదాలలో ఒక్కొక్కరికి రూ. 2,000 అందిస్తారు. ఈ నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమవుతాయి. ఫిబ్రవరి నెలలో కేంద్ర ప్రభుత్వం 19వ విడతను విడుదల చేసింది. దీని తర్వాత జూన్ నెలలో ప్రభుత్వం 20వ విడతకు సంబంధించిన డబ్బును విడుదల చేయాల్సి ఉంది. ఈ నెలలో కచ్చితంగా మోదీ సర్కార్ 20వ విడతకు సంబంధించిన డబ్బులను విడుదల చేయనుంది.
పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవాలన్న లేకా పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూడాలన్నా https://pmkisan.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఆయా వివరాలు పొందడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. పీఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది. ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందే రైతుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. పీఎం కిసాన్ ఆన్‌లైన్ పోర్టల్‌లో స్వయంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.
Also Read : Uttar Pradesh : 'ఉద్యోగం కావాలంటే నాతో పడుకో'.. రూమ్లో జరిగింది వీడియో తీసి!