/rtv/media/media_files/2025/09/18/pm-kisan-2025-09-18-09-58-56.jpg)
దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు త్వరలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుంది. దీపావళికి రెండు రోజుల ముందు పీఎం కిసాన్ నిధులు జమ చేయనుంది. 2025 అక్టోబర్ 18న దీపావళి కానుకగా 21వ విడత నిధులు జమ చేయనుందని తెలుస్తోంది. ఇటీవల కేంద్రం జీఎస్టీలో మార్పులు చేర్పులు చేసింది. ఈ మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి తీసుకొస్తోంది. మరోవైపు బిహార్ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. అందుకే వీలైనంత త్వరగా డబ్బులు జమచేయాలని కేంద్రం భావిస్తోంది.
దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి ₹6,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని మూడు సమాన వాయిదాలుగా (ఒక్కొక్కటి రూ.2,000) ప్రతి నాలుగు నెలలకు ఒకసారి నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తారు. ఈ ప్రక్రియను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) అంటారు.
కొత్తగా నమోదు చేసుకునే విధానం
- ఈ పథకంలో చేరడానికి రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- ముందుగా pmkisan.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- హోమ్ పేజీలో 'New Farmer Registration' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- అక్కడ అడిగిన వివరాలు (ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ వంటివి) నమోదు చేయాలి.
- ఆ తర్వాత భూమికి సంబంధించిన వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు కూడా అప్‌లోడ్ చేయాలి.
- మీ పీఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకోవడానికి, pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి చేక్ చేసుకోవచ్చు.
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లు (భూమి పత్రాలు, బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డ్) స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
- చివరగా దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
మీ పేరు ఉందో, లేదో చూడాలన్నా
పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవాలన్న లేకా పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూడాలన్నా https://pmkisan.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఆయా వివరాలు పొందడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. పీఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది. ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందే రైతుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. పీఎం కిసాన్ ఆన్‌లైన్ పోర్టల్‌లో స్వయంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.