PM Modi: అజ్ఞాతంలో ఉండి మోదీ చేసిన సీక్రెట్ ఆపరేషన్ గురించి మీకు తెలుసా?

ప్రధాని మోదీకి ఓ ప్రత్యేకత ఉంది. ఆయన పూర్తి పేరు నరేంద్ర దామోదరదాస్ మోదీ.  ఆయన 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వాడ్నగర్‌లో జన్మించారు. ఈరోజు మోదీ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించిన తొలి ప్రధాని మోదీ.

New Update
modi (1)

ప్రధాని మోదీకి ఓ ప్రత్యేకత ఉంది. ఆయన పూర్తి పేరు నరేంద్ర దామోదరదాస్ మోదీ.  ఆయన 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వాడ్నగర్‌లో జన్మించారు. ఈరోజు మోదీ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించిన తొలి ప్రధాని మోదీ. ఆయన కంటే ముందు ఇండియాలో ప్రధానిగా పని చేసిన వారంతా 1947కి ముందు పుట్టిన వారే. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన, అంతగా తెలియని విషయాలను తెలుసుకుందాం.

'నారియా' 
ప్రధాని మోదీ చిన్నతనంలో ఆయన ఉపాధ్యాయుడు ఆయన్ని "నారియా" అని పిలిచేవారట. ఆయన ప్రాథమిక విద్యను వాడ్నగర్‌లోని బీఎన్ హై స్కూల్లో పూర్తి చేశారు.

సన్యాసం కావాలని.. దేశ సేవ వైపు అడుగులు
పాఠశాల విద్య పూర్తయిన తర్వాత, మోదీ సన్యాసిగా మారాలనే ఆలోచనతో ఇంటినుండి వెళ్లిపోయారు. ఆయన పశ్చిమ బెంగాల్‌లోని రామకృష్ణ ఆశ్రమంతో పాటు దేశంలోని అనేక ప్రదేశాల్లో పర్యటించారు. హిమాలయాల్లో సాధువులు, ఋషులతో కొంతకాలం గడిపారు. అయితే, సన్యాసిగా మారకుండా, దేశానికి సేవ చేయాలనే సూచనతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

సైన్యంలో చేరాలనే కోరిక:
బాల్యంలో సైనికుడిగా మారాలనే కోరిక కూడా మోదీకి ఉండేది. ఆయన జామ్ నగర్‌లోని సైనిక పాఠశాలలో చేరాలనుకున్నారు. కానీ, ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల అది సాధ్యపడలేదు.

RSSతో అనుబంధం:
ఎనిమిదేళ్ల వయసులోనే మోదీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో చేరారు. ఆ తర్వాత, 1971లో గుజరాత్‌లో పూర్తికాల స్వయంసేవకుడిగా పనిచేశారు. RSS ఆయనను 1985లో బీజేపీలో చేర్చింది.

ఎమర్జెన్సీ టైంలో అజ్ఞాతంలోకి..

దేశంలో 1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు, మోదీ అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఆయన మారువేషాల్లో ప్రయాణించి, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కరపత్రాలను ముద్రించడం, ప్రదర్శనలు నిర్వహించడం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఆర్.ఎస్.ఎస్. నిషేధానికి గురైన నేపథ్యంలో, మోదీ అప్పటి ప్రభుత్వ నిఘా నుండి తప్పించుకోవడానికి నిత్యం మారువేషాలు ధరించేవారు. 'సార్దార్జీ' (సిక్కు వ్యక్తి)గా, 'స్వామీజీ'గా, కొన్నిసార్లు 'పఠాన్' వేషధారణలో కూడా ఆయన తిరిగేవారని అప్పటి సంఘ్ కార్యకర్తలు, ఆయనతో సన్నిహితంగా పనిచేసిన వ్యక్తులు తెలిపారు. ఆయన మారువేషాలు అంత సహజంగా ఉండేవంటే, ఆయన సన్నిహితులు కూడా కొందరు ఆయన్ని గుర్తుపట్టలేకపోయేవారని చెబుతారు.

ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉన్న కరపత్రాలను, సాహిత్యాన్ని ముద్రించి, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మోదీ కీలక పాత్ర పోషించారు. ప్రత్యేకించి, బార్బర్ షాపులు, ప్రజలు తరచుగా గుమిగూడే ప్రదేశాల్లో ఈ సాహిత్యాన్ని పంపిణీ చేయడానికి ఆయన సూచనలు అందించేవారు. గుజరాత్ అంతటా ఈ సాహిత్యాన్ని పంపిణీ చేసే ప్రమాదకరమైన బాధ్యతను కూడా ఆయన చేపట్టారని చెబుతారు.

Advertisment
తాజా కథనాలు