RGV: డైరెక్టర్ ఆర్జీవీకి బిగ్ షాక్.. మూడు నెలల జైలు శిక్ష
దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేలుస్తూ మూడు నెలల జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసులో మంగళవారం కోర్టు ఈ తీర్పును వెలువరించింది.