/rtv/media/media_files/2025/02/02/lu9arl75gBb11oefDBQk.jpg)
Rishi Sunak Photograph: (Rishi Sunak)
బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో నేడు దక్షిణ ముంబైలోని పార్సీ జింఖానాను సందర్శించారు. అనంతరం అక్కడ టెన్నిస్ బాల్‌తో హ్యాపీగా క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన ఫొటోను రిషి సునక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి క్యాప్షన్ కూడా జోడించారు. టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడకుండా తన ముంబై పర్యటన ఎప్పుడూ కూడా కొనసాగదన్నారు.
ఇది కూడా చూడండి: ICC Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీలో ఆ రెండు జట్లే ఫైనల్కు .. రికీ పాంటింగ్ జోస్యం
No trip to Mumbai would be complete without a game of tennis ball cricket. pic.twitter.com/UNe6d96AFE
— Rishi Sunak (@RishiSunak) February 2, 2025
ఇది కూడా చూడండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు.. కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
లిటరేచర్ ఫెస్టివల్ ..
పార్సీ జింఖానాను సందర్శించిన రిషి భవిష్యత్తులో ఇలాంటి పర్యటనలు ఎన్నో చేపట్టడానికి ఆసక్తిగా ఉన్నన్నారు. ఇదిలా ఉంటే 1885లో పార్సీ జింఖానాను స్థాపించారు. దీనికి సర్ జమ్‌సెట్‌జీ జెజిభోయ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే జైపుర్‌లో లిటరేచర్ ఫెస్టివల్ జరుగుతుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు రిషి సునాక్ భారత్‌కు వచ్చారు. ఈ క్రమంలోనే ముంబాయి వెళ్లారు.
ఇది కూడా చూడండి: Electric scooter offers: మహిళల కోసం చీపెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర తెలిస్తే అస్సలు వదలరు!
ఇదిలా ఉండగా బ్రిటన్‌లో గతేడాది జరిగిన ఎన్నికల్లో రిషి సునక్ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం బ్రిటన్ ప్రధానిగా లేబర్ పార్టీకి చెందిన కీర్ స్టార్మర్ ఉన్నారు. బ్రిటీష్ పార్లమెంటరీ ఎన్నికలలో 26 మంది భారతీయ సంతతికి చెందిన ఎంపీలు హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యారు. అందులో రిషి సునక్ కూడా ఒకరు.
ఇది కూడా చూడండి: Wedding: ఇదేం ట్విస్టురా మామా.. ఆ పాటకు వరుడు డ్యాన్స్ చేశాడని పెళ్లి క్యాన్సిల్