MEIL: మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్!

ముంబై ట్విన్ టన్నెల్స్ ప్రాజెక్టు విషయంలో మేఘా ఇన్ఫ్రాస్టక్చర్ మోసానికి పాల్పడింది అంటూ ముంబై హైకోర్టులో పిల్ దాఖలు అయింది. దీనిపై సీబీఐ లేదా సిట్ దర్యాప్తును వేయాలని కోరుతూ హైదరాబాద్ కు చెందిన జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్ దాఖలు చేశారు.

author-image
By Manogna alamuru
New Update
Big shock for Megha Krishna Reddy.

మేఘాపై ముంబై హైకోర్టులో పిల్ దాఖలు చేసిన జర్నలిస్ట్ రవి ప్రకాష్

MEIL: మేఘా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(Megha Engineering & Infrastructures Ltd) మీద ముంబై హైకోర్టు(Mumbai High Court)లో కేసు దాఖలయ్యింది. ప్రముఖ జర్నలిస్ట్ రవి ప్రకాష్(Senoir Journalist Ravi Prakash) ఈ పిల్ ను దాఖలు చేశారు. ముంబైలో బోరివలి-థానే జంట భూగర్భ సొరంగాల ప్రాజెక్టు కాంట్రాక్టులో మేఘాకు సంబంధించిన MEIL సంస్థ మోసాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. దీని కోసం మోసపూరిత హామీలను ఇచ్చిందని చెప్పారు. ఈ జంట సొరంగాల ప్రాజెక్టు విలువ రూ. 16, 600 కోట్లు. రవి ప్రకాష్ వేసిన పిల్ వచ్చేవారం విచారణకు రానుంది. దీనిపై ఆయన తరుఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ(Prashanth Bhushana) వాదనలు వినిపించనున్నారు. ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, న్యాయమూర్తి భారతి హెచ్. డాంగ్రేలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. 

journalist
Senoir Journalist Ravi Prakash

యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఒక దొంగ బ్యాంక్...

జంట సొరంగాల ప్రాజెక్టుల కోసం సెయింట్ లూసియాలో ఉన్న యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనే విదేశీ సంస్థ మోసపూరిత హామీలను జారీ చేసిందని జర్నలిస్ట్ రవిప్రకాష్ ఆరోపిస్తున్నారు. ఈ బ్యాంకు రిజర్వ్ భ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించిన విదేశీ బ్యాంకు కాదని  ఆయన తరుఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తెలిపారు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ చట్టం ప్రకారం విలీనం చేయబడిన ఒక బ్యాంక్ గ్యారెంటీలు ఎలా జారీ చేస్తుందని న్యాయవాది అన్నారు. జాతీయం చేయబడిన లేదా షెడ్యూల్ చేసిన బ్యాంకులు నుంచి వచ్చిన గ్యారెంటీల వలన భద్రత వస్తుంది కానీ ఇలాంటి బ్యాంకులవలన కాదని చెప్పారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజా పనుల శాఖ సెప్టెంబర్, 2017 నోటిఫికేషన్ పేర్కొన్నట్లు మరియు ఫైనాన్స్ అకౌంట్ డివిజన్, MMRDA యొక్క మరొక 2018 సర్క్యులర్ లో కూడా పొందుపరిచారని పిల్ లో వివరంగా రాశారు. జాతీయం చేయబడిన బ్యాంకు నుండి హామీలను ప్రభుత్వ సేకరణకు అంగీకరించాలని చెప్పినట్లు ఆధారాలు చూపించారు. 

Also Read:  ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.. దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌

MEIL
Megha Engineering and Infrastructure

ఎన్నికల బాండ్ల రూపంలో క్విడ్ ప్రో కో ఏర్పాట్లు

ట్విన్ టన్నెల్ కు సంబంధించి స్టేట్ బ్యాక్ ఆఫ్ ఇండియా ఎలాంటి జాగ్రత్తలు, పరిశీలనలు చేయకుండానే మెయిల్ సంస్థ ప్రతిపాదించిన ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారెంటీలను ఆమోదించిందని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిల్ లో పేర్కొన్నారు.  బ్యాంక్ గ్యారెంటీలకు సంబంధించిన SWIFT సందేశాలను ప్రామాణీకరించిందని PIL లో తెలిపారు. ముంబై ట్విన్ టన్నెల్ పబ్లిక్ ప్రాజెక్ట్ లు రెండింటిలోనూ మెయిల్ సంస్థ మొత్తం ఆరు మోసపూరిత గ్యారెంటీలను ఇచ్చిందని సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ ఆరోపించారు.  ఎలాంటి సురక్షితమైన హామీలను ఇవ్వకుండానే ప్రజానిధులను పొందేందుకు ప్రయత్నించారని అన్నారు. దీనికి సంబంధించి  MEIL సంస్థ అధినేత మేఘా కృష్ణ, రాజకీయ నేతల మధ్య ఎన్నికల బాండ్ల రూపంలో క్విడ్ ప్రో కో ఏర్పాట్లు జరిగాయని చెబుతున్నారు. ఆర్‌బిఐ, సిబిఐ, సిఎజి, ఆర్థిక మంత్రిత్వ శాఖతో సహా వివిధ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ రవిప్రకాష్ తెలిపారు. గత ఏడాది జరిగిన ఈ మోసంపై సీబీఐ లేదా సిట్ దర్యాప్తు     వేయాలని ఆయన పిటిషన్ లో కోరారు. దాంతో పాటూ MEIL కి ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేయాలని MMRDAను డిమాండ్ చేశారు. 

Also Read: REVANTH BHIMALA: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం బుల్లి రాజు తండ్రి పోలీస్ కంప్లైంట్.. సంచలన పోస్ట్!

Megha
MEHGA CEO Krishna

గతంలోనూ మేఘా మోసాలను బయటపెట్టిన ఆర్టీవీ...

ఇంతకు ముందు కూడా ఆర్టీవీ(RTV), సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ మేఘా సంస్థ చేసిన మోసాలను బయటపెట్టారు. తెలంగాణ(Telangana)లో ఆ కంపెనీ చేసిన మోసాలను బయటకు లాగారు. కాళేశ్వరంలో ప్రాజెక్టు విషయంలో కూడా ఇలాగే మోసాలకు పాల్పడింది మేఘా. తెలంగాణ ప్రాజెక్టుల్లో వేల కోట్లు దోచుకున్న మేఘా కృష్ణారెడ్డి అవినీతి బాగోతాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోనే రూ.48 వేల కోట్లు కృష్ణారెడ్డి దోచుకున్నారని తెలిసింది. అంతేకాదు నాసిరకం నిర్మాణాలు చేసి గత ప్రభుత్వాన్ని చిక్కుల్లో కూడా పడేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకతంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్రతిష్టపాలైందంటే ఆ పాపం ముమ్మాటికీ మేఘా సంస్థదే. కేసీఆర్‌కు మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకున్న మేఘా కృష్ణారెడ్డి తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాజెక్టుల్లో రూ.70 వేల కోట్లు దోచుకున్నాడని రిపోర్టులు చెబుతున్నాయి. కాగ్‌ రిపోర్ట్ సైతం మేఘా అవినీతి చిట్టాను బహిర్గతం చేసింది. ఈ ఒక్క రిపోర్ట్‌ చూస్తే చాలు మేఘా ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డాడో అర్థం చేసుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం విడుదల చేసి రూ.లక్షా 50 వేల కోట్లలో ఒక్క మేఘా కృష్ణారెడ్డే 48 వేల కోట్లు నొక్కేశాడని కాగ్‌ రిపోర్ట్ బయటపెట్టడం ఆయన అవినీతికి అద్దం పడుతోంది.

Also Read :  ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు

bank
EURO EXIM BANK

సీబీఐ ఎంక్వైరీ..

అలాగే మేఘా కృష్ణారెడ్డి(Megha Krishna Reddy) కి షాక్ ఇచ్చింది సీబీఐ. ఎన్‌ఐఎస్‌పి సంబంధించిన రూ. 315 కోట్ల ప్రాజెక్ట్‌లో అవినీతికి పాల్పడినట్లు గుర్తించిన సీబీఐ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌తో పాటు స్టీల్ మంత్రిత్వ శాఖలోని ఎన్‌ఎండిసి ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్‌కు చెందిన ఎనిమిది మంది అధికారులపై 120బీ ఐపీసీ, ఐపీసీ 465, సెక్షన్ 7,8 &9 కింద కేసు నమోదు చేసింది. జగదల్‌పూర్‌ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ పనులకు సంబంధించి మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీకి చెందిన రూ. 174 కోట్ల బిల్లులను క్లియరింగ్‌ చేసేందుకు ఎన్‌ఐఎస్‌పి, ఎన్‌ఎండిసికి చెందిన ఎనిమిది మంది అధికారులకు అలాగే మెకాన్‌ కంపెనీకి చెందిన ఇద్దరు అధికారులకు రూ. 78 లక్షలు లంచం ఇచ్చారు మేఘా కృష్ణారెడ్డి. మొత్తం ఈ 10 మంది అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది.

mumbai
Mumbai Twin Tunnel

ఆర్టీవీ వెలుగులోకి తెచ్చిన వేల కోట్ల ఫేక్‌ బ్యాంక్‌ గ్యారెంటీ స్కామ్‌  పరిశోధనలోకి ఎట్టకేలకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ప్రవేశించింది. ఆర్టీవీ వార్తలను చూసి స్పందించిన ఎంపీ కార్తీ చిదంబరం రిజర్వు బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI)కి లేఖ రాశారు. దీంతో ఈ భారీ స్కామ్‌పై విచారణ చేపట్టి దోషులను పట్టుకోవాలని CBIని RBI ఆదేశించింది. దీంతో ఇలాంటి భారీ స్కామ్‌ వార్తను బయటకు రాకుండా చూడాలని ప్రయత్నించిన వారికి బిగ్‌ షాక్ తగిలినట్లయింది. ఈ స్కామ్‌ సూత్రధారులు, పాత్రధారులు ఇప్పుడు ఒక్కొక్కరుగా త్వరలోనే CBI ముందుకు వచ్చారు. ఈ ఫేక్‌ గ్యారెంటీ స్కామ్‌లో SBI పాత్రను బహిర్గతం చేసే ఫోన్‌ వివరాలు ప్రస్తుతం ఆర్టీవీ దగ్గర ఉన్నాయి. 

Also Read: Amazon: ఇక మీదట అమెజాన్లో కూడా పది నిమిషాల్లో డెలివరీ..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు