/rtv/media/media_files/2025/01/25/nvWspVRBiMt1UwWe3N6m.jpg)
Yamini Malhotra
Yamini: ప్రముఖ నటి యామినీ మల్హోత్రా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. ముంబైలో అద్దె ఇళ్లు దొరకడం చాలా కష్టంగా మారిందని, ఇంటి ఓనర్స్ మొదట హిందువా? ముస్లిమా? అని అడుగుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు వెజ్ టేరియనా? లేద మాంసాహారం తింటావా? అంటూ ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలిపింది. సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్నానంటే చాలు.. నిర్మోహమాటంగా ఇల్లు లేదంటున్నారని వాపోయింది.
Bigg Boss 18 ke ghar ko inhone maana tha apna sasural. Find out kaun the inke apne aur kisne kiya tha inka haal behaal? 😉
— JioCinema (@JioCinema) December 23, 2024
Dekhiye #BiggBoss18 @ColorsTV aur #JioCinema par.#BB18 #BiggBoss18onJioCinema #BiggBoss @BeingSalmanKhan @MalhotraYamini pic.twitter.com/P0ysNQcrjp
నువ్వు హిందువా.. ముస్లిమా..
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇందుకు సంబంధించి పోస్ట్ పెట్టింది యామినీ. నేను యాక్టింగ్ ఫీల్డ్‌లో పనిచేస్తున్నానని చెబితే ఇంటి యజమానులు ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ‘నువ్వు హిందువా.. ముస్లిమా’ అని అడుగుతున్నారు. ముంబైలో అద్దెకు ఇల్లు దొరకడం చాలా కష్టంగా మారింది. నా చాలా చేదు అనుభవం గురించి చెబుతున్నా. నిజానికి నేను ముంబైని ఎంతగానో ప్రేమిస్తున్నా. కానీ ఇక్కడ ఇల్లు పొందడం కష్టం. హిందువా లేక ముస్లిమా, గుజరాతీనా, మార్వాడీనా అని ఆరా తీస్తున్నారు. నటిని అని చెబితే నిర్మోహమాటంగా ఇవ్వమంటున్నారు. నేను నటనా రంగంలో పని చేస్తున్నందున అద్దెకు ఇల్లు పొందే అర్హత లేదా? 2025లో కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నందుకు ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి ఆంక్షలు ఉంటే మనం దీనిని కలల నగరం అని పిలవగలమా’ అని యామినీ బాధపడుతోంది.
అయితే ముంబైలో యామిని కంటే ముందు మరికొందరు నటీనటులు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కాగా యామిని నటిగానే కాదు ఢిల్లీలో డెంటిస్ట్ గా పనిచేస్తోంది. ‘మైన్ తేరీ తు మేరా’, ‘గమ్ హై కిసీ కే ప్యార్ మే’ వంటి సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించి భారీ పాపులారిటీ పొందింది. తెలుగులో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ‘చుట్టాలబ్బాయి’ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది.