Allam Narayana: మోహన్ బాబు ఓ ఉన్మాది.. అల్లం నారాయణ ఫైర్!
జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని అల్లం నారాయణ ఖండించారు. ఆయన ఓ ఉన్మాదిలా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి సమస్య బజారున పడి, కేసులు నమోదైన తరువాతే మీడియా జోక్యం చేసుకుందన్నారు. మీడియాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Mohan Babu: మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట!
నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పోలీసుల ముందు విచారణకు న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. డిసెంబర్ 24కు విచారణను వాయిదా వేసింది. ప్రతి రెండు గంటలకు ఒకసారి మోహన్ బాబు ఇంటిని పరిశీలించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
మా నాన్న చేసిన తప్పు అదే.. మంచు విష్ణు సంచలనం!
మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలపై క్లారిటీ ఇచ్చారు మంచు విష్ణు. తాను లేని 4,5 రోజుల్లోనే గొడవలు జరిగిపోయాయన్నారు. నిన్నటి ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి కాదని వివరణ ఇచ్చారు. మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు అని కీలక వ్యాఖ్యలు చేశారు.
Mohan Babu: హైకోర్టుకు మోహన్ బాబు!
నటుడు మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు తనకు పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని పిటిషన్ లో కోరారు. మోహన్ బాబు తరఫున నగేష్ రెడ్డి, మురళి పిటిషన్ వేశారు.
మోహన్ బాబుకు బిగ్ షాక్.. పద్మశ్రీ రద్దు?
జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని పౌర సమాజం ఖండిస్తోంది. మోహన్‌బాబు, విష్ణుపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం మోహన్‌బాబుకు ప్రకటించిన.. పద్మశ్రీ అవార్డును రద్దు చేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ డిమాండ్ చేశారు.
BIG BREAKING: మోహన్ బాబుపై కేసు.. మూడేళ్ళ జైలు శిక్ష?
మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి రిపోర్టర్ పై చేసిన దాడి నేపథ్యంలో ఆయనపై BNS118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు రాచకొండ సీపీ నోటీసులు ఇచ్చారు. మోహన్ బాబుకు ఈ కేసులో మూడేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Mohan Babu : హాస్పిటల్ లో చేరిన మోహన్ బాబు..!
మోహన్ బాబు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. హైబీపీ, గుండెలో నొప్పి సమస్యతో ఆయన గచ్చిబౌలిలోనూ కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో మోహన్ బాబు చికిత్స తీసుకుంటున్నారు. మోహన్ బాబుతో పాటు పెద్ద కొడుకు మంచు విష్ణు ఉన్నాడు.