ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబ వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో మోహన్‌బాబు మేనేజర్ వెంకట కిరణ్‌ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ వివాదంలో జరిగిన ఘర్షణకు సంబంధించి మంచు మనోజ్, తన తండ్రి మోహన్‌బాబు ఇప్పటికే ఒకరిపై మరోకరు పోలీసులకు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. అయితే మనోజ్ ఫిర్యాదు మేరుకు పోలీసులు ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. Also Read: మోదీతో కపూర్ ఫ్యామిలీ.. కరీనా చేసిన పనికి అంతా షాక్! Mohan Babu Manager Arrest అలాగే ఈ ఘర్షణలకు సంబంధించి కారకులను గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. మోహన్‌బాబు ఇంటివద్ద మాయమైన సీసీటీవీ ఫుటేజ్‌పై దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన మేనేజర్ వెంకట కిరణ్‌ను తాజాగా అరెస్టు చేశారు. ఇదిలాఉండగా.. గత ముడురోజులుగా మంచు ఫ్యామిలీలో గోడవలు జరగడం, అలాగే వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. Also Read: ఇకనైనా ఆ పని మానుకోండి.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్ ఇక మంగళవారం మోహన్ బాబు, మనోజ్ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. మోహన్‌బాబు ఇంటికి మనోజ్.. తన భార్యతో కలిసి వెళ్లారు. దీంతో అక్కడున్న బౌన్సర్లతో గొడవ జరిగింది. అయితే ఈ దాడిలో మనోజ్ గాయపడ్డారు. తనపై మోహన్‌బాబు మేనేజర్ వెంకట రమణ దాడి చేశాడని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకట కిరణ్ పరారీలో ఉండటంతో పోలీసులు అతడి కోసం గాలించి ఎట్టకేలకు అరెస్టు చేశారు. మరోవైపు మోహన్‌బాబు రిపోర్టర్‌పై దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. మోహన్ బాబును అరెస్టు చేయాలంటూ జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. Also Read: ఆత్మహత్యకు ముందు స్నానం..వందసార్లు శివనామస్మరణ Also Read : YouTube: యూట్యూబ్‌లో కొత్త ఫీచర్.. ఇక దున్నుడే దున్నుడు!