Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాల్పులు.. వరంగల్ మహిళా మావోయిస్టు మృతి
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి కాల్పులు జరిగాయి. బస్తర్ ప్రాంతంలో సోమవారం భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఆమెను వరంగల్‌కు చెందిన రేణుకగా గుర్తించారు.
Maoists encounter: ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్కౌంటర్.. భీకర కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీష్గడ్ సుక్మా జిల్లాలోని కెర్లపాల్ శనివారం భద్రతా బలగాలు, నక్సల్ మధ్య భీకర కాల్పులు జరిగాయి. శుక్రవారం నుంచి జిల్లా భద్రతా దళాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. శనివారం ఉదయం జరిగిన భీకర కాల్పుల్లో 15 మంది మవోయిస్టులు మృతి చెందారు.
Seethakka: మావోయిస్టుకు నివాళి అర్పించిన సీతక్క.. జ్ఞాపకాలు తలచుకుంటూ కన్నీళ్లు!
మాజీ మావోయిస్టు అమరుడు, తన భర్త కుంజా రామును తలచుకుంటూ మంత్రి సీతక్క కన్నీరుపెట్టుకున్నారు. మహబూబాబాద్ మోకాళ్లపల్లిలో రాము వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామునుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందానని, ఆ నైతికతతోనే పనిచేస్తున్నట్లు తెలిపారు.
BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్.. ఐదుగురు మృతి!
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్-దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో పోలీసుల కాల్పుల్లో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. కాల్పులు కొనసాగుతున్నాయని భద్రతా బలగాలు తెలిపాయి.
Maoist: ఆపరేషన్ హిడ్మా.. 125కు పైగా గ్రామాలను చుట్టుముట్టిన బలగాలు.. అడవిలో హైటెన్షన్!
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మద్వి హిడ్మా కోసం భద్రతా బలగాలు భారీ ప్లాన్ వేశాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న 125 గ్రామాలను చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని మార్గాల సమాచారం పోలీసులు సేకరించినట్లు సమాచారం.
Encounter: ఒకే రోజు రెండు ఎన్కౌంటర్లు.. 30 మంది మావోయిస్టులు హతం!
మావోయిస్టులకు మరో ఊహించని షాక్ తలిగింది. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఒకేరోజు రెండు ఎన్కౌంటర్లు జరిగాయి. ఉదయం బీజాపుర్‌లో 26 మంది మావోలు చనిపోగా తాజాగా కాంకెర్ జిల్లాలో మరో నలుగురు పోలీసుల కాల్పుల్లో మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 30కి చేరింది.
Amith sha: నక్సల్ ఫ్రీ ఇండియా.. మావోల ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా సంచలన పోస్ట్!
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై హోం మంత్రి అమిత్ షా ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు భారత సైనికులు 'నక్సల్ ముక్త్ భారత్ అభియాన్' దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారని పొగిడేశారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్స్ రహితంగా మారబోతోందంటూ పోస్ట్ పెట్టారు.
Encounter: మరోసారి దండకారణ్యంలో కాల్పుల మోత.. 22 మంది మావోయిస్టులు మృతి
తాజాగా మరోసారి కాల్పుల మోతతో దండకారణ్యం దద్దరిల్లింది. గురవారం ఉదయం బీజాపుర్-దంతెవాడ జిల్లాల సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి మృతి చెందారు.