/rtv/media/media_files/2025/04/25/gAhkV21Bzwl9dX2VmwTo.jpg)
Maoist Operation: మావోయిస్ట్ వ్యతిరేక ఆపరేషన్‌తో తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలు ఎరుపెక్కాయి. చత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దులోని దండకార్యం అడవుల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగం పీఎల్‌జీఏ లక్ష్యంగా పోలీసు బలగాలు బచావో కర్రెగుట్టలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ అడువులను ఆ రాష్ట్ర పోలీసులు, భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. సెంట్రల్ ఫోర్స్ ఛత్తీస్‌గడ్ రాష్ట్రం బీజాపుర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న అడవుల్లోకి మూడు రోజులుగా దూసుకెళ్తున్నాయి. కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు దాదాపు 100పైగా ఐఈడీలను నిర్వీర్యం చేసినట్లు తెలుస్తోంది.
Also read: Army Encounter: ఆర్మీ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ మృతి
A team of DRG, COBRA, STF, CRPF, & Bastar Fighters is conducting an operation
— Shiro (@ShiroBarks) April 25, 2025
Telangana's Greyhounds and Maharashtra's C60 have encircled Karregutta, Nadpalli & Pujari Kanker hills
5 Naxals killed at Karregutta
Top leaders Hidma, Deva & Damodar are believed to be camping there https://t.co/pACxY2XgRG
బీజాపూర్ జిల్లా పూజారి కాంకేడ్ మీదుగా చొచ్చకెళ్తూ.. హిడ్మాను టార్గెట్ చేస్తూ మందుకు కదులుతున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో క్రమంగా మవోయిస్టులు పూర్తిగా పట్టుకోల్పోతున్నారు. కర్రెగుట్ట మీదుగా తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్ర, కేంద్ర బలగాలు కర్రెగుట్టలను పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నాయి. కర్రెగుట్టల ఆపరేషన్‌తో మాకు సంబంధం లేదని తెలంగాణ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
Chhattisgarh: Another successful Ops by Security forces - 8 Naxalites killed in an encounter in the border area of Narayanpur-Bijapur-Dantewada.
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 24, 2024
Visuals of our Bravehearts crossing the Indravati River as they return to their headquarters after successful ops pic.twitter.com/8duSyH54bg
తెలంగాణ వైపు ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలతోపాటు ఛత్తీస్‌గఢ్ వైపు బీజాపుర్ జిల్లా ఊసూరు బ్లాక్ సరిహద్దులుగా సుమారు 90 కి.మీ. పొడవున గొలుసుకట్టుగా ఈ కొండలు విస్తరించి ఉన్నాయి. సముద్ర మట్టానికి సుమారు 9 వేల అడుగుల ఎత్తులో ఉండటంతోపాటు వీటిపైన దాదాపు 10-15 కి.మీ. మేర విస్తీర్ణం ఉండటంతో కొన్నేళ్లుగా మావోయిస్టులు స్థావరంగా మార్చుకున్నారు. సుమారు 1000 మంది పీఎల్‌జీఏ సభ్యులు ఇక్కడే ఉన్నట్లు నిఘావర్గాల సమాచారం. కేంద్ర కమిటీ అగ్రనాయకులు హిడ్మా, దేవ, వికాస్, దామోదర్ వంటి వారూ ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుమారు 3 వేల మంది బలగాలు ఈ ఆపరేషన్‌లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
Also Read: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన
Also Read: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'
(maoist | telanagan | dandakaranyam | maoist commander hidma | Chattisgarh Naxal Attack | chattisghad | chattisgarh border | telugu-latest-news | Maoist Operation | Anti-Maoist Operation)