KCR: అధికారం పోగానే నక్సలైట్లు గుర్తుకొచ్చారా.. కేసీఆర్‌పై రఘునందన్ సంచలన కామెంట్స్!

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలంటూ ఎల్కతుర్తి సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రఘునందన్ సెటైర్లు వేశారు. ‘ఆపరేషన్ కగార్’‌పై అంత కంగారు ఎందుకని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని మావోయిస్టులు అధికారం పోగానే గుర్తుకొస్తున్నారని విమర్శించారు.

New Update
kcr raghun

Raghunandan Rao sensational comments on KCR

Maoist: మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలంటూ ఎల్కతుర్తి సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రఘునందన్ సెటైర్లు వేశారు. ‘ఆపరేషన్ కగార్’‌పై అంత కంగారు ఎందుకని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నపుడు గులాబీ నేతకు మావోయిస్టులు గుర్తుకు రాలేదని, అధికారం పోగానే గుర్తుకొచ్చారంటూ సెటైర్స్ వేశారు. 

అధికారం కోసం మావోయిస్టులకు మద్ధతు..

ఈ మేరకు ఆదివారం వరంగల్ ఎల్కతుర్తి వేదికగా జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో నక్సలైట్లకు కేసీఆర్ మద్దతుగా నిలిచారు. ఛత్తీస్‌గఢ్‌లో ‘ఆపరేషన్ కగార్’ పేరుతో అక్కడున్న గిరిజనులు, యువతను ఊచకోత కోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చలకు సిద్ధమని మావోయిస్టులు కోరుతున్నారని, వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని వెంటనే చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై తీర్మానం చేసి వెంటనే కేంద్రానికి పంపుతామని కేసీఆర్ చెప్పారు. దీంతో కేసీఆర్ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం మావోయిస్టులను పావుగా వాడుకోవాలని చూస్తున్నారంటూ రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. 

Also Read: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

న్యూ డెమోక్రసీ ర్యాలీ, సీఎం రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ సమావేశం, కేసీఆర్ డిమాండ్ అన్నీ ఒక్కరోజులోనే జరిగాయి. ఇదేం చిత్రమో అర్థం కావడం లేదు. అధికారంలో ఉన్ననాడు గులాబీ నేతకు మావోయిస్టులు గుర్తుకు రాలేదు. అధికారం పోగానే గుర్తుకొచ్చారా? అంటూ తనదైన స్టైల్ లో మండిపడ్డారు. ఇక బీజేపీపై కేసీఆర్ విమర్శలను తిప్పికొట్టారు. అరిగిపోయిన రికార్డే మళ్లీ ప్లే చేశారంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రసంగంలో ఏమాత్రం కొత్తదనం లేదు. కేటీఆర్, హరీశ్ రావు మాట్లాడిన మాటలే కేసీఆర్ మాట్లాడారని, ఎన్నడూలేని విధంగా పొలిటికల్ స్పీచ్ చదివారంటూ విమర్శించారు. 

Also Read: Vitamin B12 Deficiency: విటమిన్ బి12 లోపం వల్ల ఈ తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త!

kcr | bjp mp raghunandan | telugu-news | today telugu news 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు