KCR: నక్సలైట్లను చంపొద్దు.. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపండి: కేసీఆర్ సంచలనం!

మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆపరేషన్ కగార్ వెంటనే ఆపాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ గడ్డ కర్రెగుట్టల్లో మారణం హోమం ఆపి, నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలని సూచించారు. మావోయిస్టులు ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రభుత్వం వినాలన్నారు.

New Update
kcr maoist

KCR demanded Operation Kagar stopped immediately

KCR: మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆపరేషన్ కగార్ వెంటనే ఆపాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ గడ్డ కర్రెగుట్టల్లో మారణం హోమం ఆపి, నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలని సూచించారు. మావోయిస్టులు ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రభుత్వం వినాలన్నారు.ఈ మేరకు ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మొదట పహల్గాం ఘటనపై స్పందించారు. పార్టీ శ్రేణులతో పాటు రెండు నిమిషాలు మౌనం పాటించారు. 25ఏళ్లుగా తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు. మాట తప్పితే రాళ్లతో కొట్టాలన్నారు. వరంగల్ నేలకు వందనం చెప్పారు.

Also Read: భారీ పేలుడు.. 25 మంది స్పాట్ డెడ్ -1,139 మందికి తీవ్ర గాయాలు

Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు

రాష్ట్రాన్ని నాశనం చేశారు..

ఈ మేరకు తాము ఎన్నడు పదవుల కోసం పాకులాడలేదన్నారు. పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ పేరెత్తితే తొక్కిపెట్టినట్లు గుర్తు చేశారు. తెలంగాణకు నెం1 విలన్ కాంగ్రెస్ అన్నారు. జయశంకర్ సార్ తో కలిసి అనేక రూపాల్లో భయంకరమైన పోరాటం చేశామన్నారు. బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ కోసం పదవులు త్యాగం చేశారని చెప్పారు. వందలమంది ప్రాణ త్యాగాలతో గులాబీ జెండా నిలబడిందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. పాలమూరు జిల్లాలో నీటి కరువు తీర్చామన్నారు. మూడెండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టుకున్నామన్నారు. పడావు భూములన్నీ పచ్చగా మార్చుకున్నామని, పంజాబ్ ను తలదన్నే పంటలు పండేలా తీర్చిదిద్దామమని చెప్పారు.

Also Read: ఇంటిలిజెన్స్ కీలక సమాచారం.. ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు

Also Read: స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!

maoist  telangana 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు