BIG BREAKING: జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్.. కారణం అదేనా!?

సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆపరేషన్ కగార్, మావోయిస్టులతో శాంతి చర్చలు, కాల్పుల విరమణ అంశాలపై చర్చించారు. శాంతి చర్చల కమిటీ విజ్ఞప్తి మేరకు ఈ భేటీ జరిగినట్లు తెలుస్తుండగా ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.  

New Update
revanth jana

CM Revanth Reddy meets senior Congress leader Jana Redd

BIG BREAKING: సీఎం రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆపరేషన్ కగార్, మావోయిస్టులతో శాంతి చర్చలు, కాల్పుల విరమణ అంశాలపై చర్చించారు. శాంతి చర్చల కమిటీ విజ్ఞప్తి మేరకు ఈ భేటీ జరిగినట్లు తెలుస్తుండగా ఏ నిర్ణయం తీసుకోనున్నారనేది ఉత్కంఠగా మారింది. 

శాంతి చర్చల కమిటీ విజ్ఞప్తి..

ఈ మేరకు ఆదివారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో శాంతి చర్చల నేతలు సమావేశమయ్యారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్ శాంతి చర్చల కమిటీ నేతలలు సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. దీంతో ఈ అంశంపై జానారెడ్డి సలహాలు, సూచనలమేరకు నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. ఇందులో భాగంగానే జానారెడ్డితో సమావేశమయ్యారు సీఎం రేవంత్. 

ఆపరేషన్ కగార్ ను వ్యతిరేకించిన కేసీఆర్ 

మరోవైపు మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆపరేషన్ కగార్ వెంటనే ఆపాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ గడ్డ కర్రెగుట్టల్లో మారణం హోమం ఆపి, నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలని సూచించారు. మావోయిస్టులు ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రభుత్వం వినాలన్నారు.ఈ మేరకు ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ఈ ఘటనపై స్పందించడం చర్చనీయాంశమైంది. 

Also Read: గుజరాత్‌లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!

కేంద్ర బలగాలు  చేపట్టిన ఆపరేషన్ కర్రె గుట్టల్లో కీలక అడుగు ముందుకుపడింది. ఐదు రోజుల సెర్చ్ ఆపరేషన్‌లో మావోయిస్టుల బంకర్‌ ను గుర్తించారు. మావోయిస్టుల కంచుకోట అయినా కర్రెగుట్టల్లో నక్సలైట్ల భారీ బంకర్‎ను భద్రతా దళాలు గుర్తించాయి. దాదాపు వెయ్యి మంది ఉండేలా నిర్మించిన భారీ గుహను భద్రత దళాలు కనిపెట్టాయి. ఈ గుహలో నీటి సౌకర్యం కూడా ఉన్నట్లు గుర్తించారు. భద్రతా బలగాల రాకను ముందే పసిగట్టిన మావోయిస్టులు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు.  కాగా కర్రెగుట్టల్లో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గుహ విజువల్స్‌ను భద్రతా బలగాలు విడుదల చేశాయి.

Also Read: BSF jawan : 80 గంటలు, 3 సమావేశాలు.. BSF జవాన్ ఎక్కడ.. పాక్ ఆర్మీ అతన్ని ఏం చేసింది?

maoist | cm revanth | janareddy | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు