Manipur: మణిపుర్లో మళ్లీ హింస.. ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లపై దాడులు
మణిపుర్లో ఇటీవల మైతీ వర్గానికి చెందిన ఆరుగురిని కూకీ మిలిటెంట్లు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. శనివారం ఆ ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా పెద్దఎత్తున అలజడులు చెలరేగాయి. ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లపై నిరసనాకారులు దాడులు చేశారు.