Manipur: గతాన్ని మర్చిపోయి నన్ను క్షమించండి.. సీఎం వేడుకోలు!

మణిపూర్‌లో ఈ ఏడాది జరగిన అల్లర్లు, హింసాకాండ గురించి అందరికీ తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. ప్రజలు అంతా గతాన్ని మర్చిపోయి తనను క్షమించాలని కోరారు.

New Update
biren

biren

Manipur: 2023 మే నెల నుంచి మణిపూర్‌లో జరుగుతున్న జాతి హింసపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తాజాగా స్పందించారు. గతంలో జరిగిన అన్నింటినీ మర్చిపోయి, కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నవేళ ప్రజలు తనను క్షమించాలని కోరారు. ఇంఫాల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హింసాకాండ గురించి ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణ జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది చాలా దురదృష్టకరంగా గడిచిందని ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ అన్నారు.

Also Read: Telangana: రాబోయే 5 రోజులు జర భద్రం.. వాతావరణ శాఖ హెచ్చరికలు

గతేడాది మే 3వ తేదీ నుంచి నేటి వరకు జరుగుతున్న హింసాకాండకు ప్రజలకు క్షమాపణ తెలియజేయాలనుకుంటున్నానని అన్నారు.ఈ హింసాకాండ వల్ల అనేక మంది తమ ప్రియమైన వారిని కోల్పోయారని, మరికొందరు తమ ఇళ్లు వదిలిపెట్టి  వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే ఈ అల్లర్లలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వివరించారు.

Also Read: AP: మద్యం దుకాణదారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్‌ న్యూస్‌

ఈ సంఘటనలకు బాధపడుతున్నట్లు ముఖ్యమంత్రి  బిరేన్ సింగ్ వివరించారు. అయితే గత మూడు, నాలుగు నెలలుగా రాష్ట్రంలో శాంతి, భద్రతలు ఓ కొలిక్కి వస్తున్నాయని అన్నారు. 2025 సంవత్సరంలో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని తాను ఆశిస్తున్నట్లు వివరించారు.

Also Read: Ap Govt: ఏపీలో పలువురు ఐఏఎస్‌,ఐపీఎస్‌ లకు పదోన్నతులు!

2023 మే 3వ తేదీ నుంచి కుకీ, మైతేయిల మధ్య ఘర్షణలు చెలరేగగా.. ఈ హింసాకాండలో మొత్తం 200 మందికి పైగా చనిపోయారని  ముఖ్యమంత్రి అన్నారు. అలాగే నిరాశ్రయులైన 2 వేల 58 మంది కుటుంబాలను ఇంఫాల్‌లోని పలు ప్రాంతాల్లో పునరావాసం కల్పించినట్లు తెలిపారు. ముఖ్యంగా జాతీయ రహదారుల వెంట హింసను ఆరికట్టేందుకు NH-2, NH-37 లపై వరుసగా అదనపు భద్రతా సిబ్బందిని ఉంచినట్లు చెప్పారు. 

Also Read: Musk: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్‌..ఎంత వింతగా ఉందో చూడండి!

నిరసనకారులు ప్రభుత్వం నుంచి దోచుకున్న 6 వేల ఆయుధాల నుంచి 3 వేల ఆయుధాలను ఇప్పటికే  స్వాధీనం చేసుకున్నట్లు సీఎం చెప్పారు. అలాగే 625 మంది నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేసినట్లు  మొత్తం 12 వేల 247 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

అంతేకాకుండా మణిపూర్ ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ ను 32 నుంచి 39 శాతానికి పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి బిరేన్  ప్రకటించారు. అలాగే వివిధ పథకాల ద్వారా హింసాకాండలో ప్రభావితమైన నిర్వాసితులకు సాయం చేసేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు