/rtv/media/media_files/2025/02/11/I2XXtTst6zRAE9UIjLUG.jpg)
Manipur MLAs Responds on selection of new CM
మణిపుర్ సీఎం పదివికి బీరెన్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరీ ఇప్పుడు సీఎంగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 9న బీరెన్ సింగ్ రాజీనామా చేసినప్పటి నుంచి ఈశాన్య రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఇంఛార్జి సంబిత్ పాత్ర ఇంఫాల్‌లోనే ఉంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో విడివిడిగా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం బీజేపీ ఎమ్మెల్యేలు సపమ్ కెబా, ఇబోమ్‌ఛా.. సంబిత్ పాత్రను ఓ హోటల్‌లో కలిశారు.
Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో 21413 పోస్టల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్!
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు అక్కడే మీడియాతో మాట్లాడారు. మణిపుర్‌లో శాంతి కోసం చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. అయితే కొత్త సీఎం ఎవరూ అని మీడియా అడగగా.. దీనిపై పార్టీ హైకమాండే తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. దీనిపై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కొత్త సీఎంను ఎన్ని రోజల్లో ఎంపిక చేసే ఛాన్స్ ఉందనేదానిపై చర్చించలేదని చెప్పారు.
Also Read: పారిస్ ఏఐ సమ్మిట్.. అలాంటి వారికే ఉద్యోగవకాశాలు ఉంటాయన్న ప్రధాని మోదీ
మణిపుర్‌లో కొన్ని నెలలుగా మెయిటీ, కుకీ జాతుల మధ్య చెలరేగిన అల్లర్లు ఆందోళన రేపుతున్నాయి. అక్కడ శాంతిని పునరుద్ధరించేందుకు కేంద్రం ప్రభుత్వ యత్నిస్తోంది. ఇదిలాఉండగా మణిపుర్ బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మణిపుర్‌లో జరిగిన అలర్ల వల్ల ఇప్పటిదాకా దాదాపు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక మణిపుర్ కొత్త సీఎం ఎవరు అనేదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
Also Read: ఆ కోతి చేసిన పనికి 11 గంటలు కరెంట్ కట్.. ఆ మంకీ ఏం చేసిందో తెలుసా?
Also Read: భర్తముందే కూతుళ్లపై ప్రియుడితో అత్యాచారం చేయించిన తల్లి.. ‘వలయార్ కేసు’లో భయంకర నిజాలు!