/rtv/media/media_files/2025/02/04/ckrR4WBiwU6TsoyowDwc.jpg)
Supreme Court seeks forensic report on audio clips alleging Biren Singh's role in ethnic clash
2023లో మణిపూర్‌లో మెయిటీ, కూకీ జాతుల మధ్య చెలరేగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తమకు ఎస్టీ హోదా కావాలని మెయిటీ ప్రజలు డిమాండ్ గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో దాదాపు రెండేళ్ల క్రితం చెల్లరేగిన అల్లర్లు తీవ్ర ఉద్రిక్తతలకు దారీ తీశాయి. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణిగినప్పటికీ అప్పుడప్పుడు ఎక్కడో ఓ చోట అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. అయితే మెయిటీ, కుకీ జాతుల మధ్య హింసాత్మక ఘటనలు చెలరేగిన సమయంలో మణిపూర్ సీఎం బైరెన్ సింగ్.. ఉద్దేశపూర్వకంగానే గిరిజనులపై దాడి చేసేందుకు మెయిటీ మిలిటెంట్లకు రాష్ట్ర ఆయుధాలు దోచుకునేందుకు అనుమతించారని కుకీ ప్రజలు ఆరోపిస్తున్నారు.
Also Read: కేసీఆర్ కు ప్రధాని మోదీ లేఖ.. ఎందుకో తెలుసా?
దీనిపై సుప్రీంకోర్టులో కూడా వివాదం నడుస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ అంశంపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం బైరెన్ సింగ్ మట్లాడిన ఆడియో క్లిప్‌కు సంబంధించి ఫారెన్సిక్ రిపోర్టును ప్రవేశపెట్టాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. 6 వారాల్లోగా సీల్డ్ కవర్‌లో దీన్ని అందించాలని సూచించింది. అయితే కూకీ కమ్యూనిటీ తరఫు హాజరైన న్యాయవాది ప్రశాంత్ భుషణ్ దీనికి సంబంధించి కీలక ఆరోపణలు చేశారు.
అల్లర్లు చెలరేగిన సమయంలో సీఎం బైరెన్ సింగ్.. మెయిటీ మిలిటెంట్లకు ఆయుధాలు దోచుకునేందుకు పర్మిషన్ ఇవ్వడం, ఆ తర్వాత వాళ్లని ఎలా రక్షించడానేదానిపై ఓ వ్యక్తి రహస్యంగా సీఎం మాటలు రికార్డు చేశాడని ప్రశాంత్ భుషణ్ వాదించారు. ఆ ఆడియోను ఫారెన్సిక్ ల్యాబ్‌కు కూడా పంపించాలని డిమాండ్ చేశారు. అయితే గత ఏడాది నవంబర్ 8న సుప్రీంకోర్టు.. సీఎం ఆడియో క్లిప్ సంబంధించిన అన్ని విషయాలు దాఖలు చేయాలని ప్రశాంత్ భుషణ్‌ను కోరింది. అయితే తాజాగా ఈ అంశంపై జరిగిన విచారణలో సీఎం ఆడియో క్లిప్‌కు సంబంధించి ఫారెన్సిక్ రిపోర్టును 6 వారాల్లోగా అందించాలని ఆదేశించింది.
Also Read: ఇక ఎంజీబీఎస్ కు వెళ్లాల్సిన పని లేదు... హైదరాబాద్ లో మరో 3 బస్టాండ్లు.. ఎక్కడో తెలుసా?
ఇదిలాఉండగా.. మణిపూర్‌లో ఉంటున్న మెయిటీలు తనకు కూడా కుకీల లాగే ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా ఏళ్లుగా దీనిపై వివాదం నడుస్తూనే ఉంది. అయితే 2023లో మణిపూర్ హైకోర్టు.. ఈ సమస్యపై స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో 2023 మే నెలలో మెయిటీ, కుకీల మధ్య హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 200 మందికి పైగా మృతి చెందారు.