Amit Shah: మణిపుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. అమిత్‌ షా కీలక నిర్ణయం

మణిపుర్‌లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడ శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే అక్కడికి అదనపు బలగాలను తరలించనున్నట్లు సమాచారం.

New Update
amit shahh

మణిపుర్‌లో గత కొంతకాలంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజా పరిస్థితులపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడ శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే త్వరలోనే 50 కంపెనీల బలగాలను కేంద్ర ప్రభుత్వం మణిపుర్‌కు తరలించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మంత్రిత్వ శాఖలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.    

Also Read: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం..107 విమాన సర్వీసులు ఆలస్యం!

ఎన్‌కౌంటర్లు, హత్యలు

అలాగే మంత్రిత్వశాఖ బృందం కూడా త్వరలోనే మణిపుర్‌లో పలు కీలక ప్రాంతాలను సందర్శించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు మణిపుర్‌లో కుకీలు, మెయిటీల మధ్య వైరం ఇంకా జరుగుతూనే ఉంది. అయితే ఇటీవల నెలకొన్న పరిస్థితులు మరింత హింసాత్మకంగా మారాయి. ఇటీవల సీఆర్‌ఎపీఎఫ్‌ ఎన్‌కౌంటర్‌లో 10 మంది మృతి చెందారు. అలాగే కూకీ మిలిటెంట్లు మెయిటీ వర్గానికి చెందిన ముగ్గురు చిన్నారులు, ముగ్గురు మహిళలను కిడ్నాప్ చేసి హత్య చేయడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. 

Also Read: భార్యను ఉద్యోగం మానేయమని బలవంతం చేయడం క్రూరత్వమే!

ఈ క్రమంలోనే మణిపుర్ సీఎం బీరేన్ సింగ్‌తో పాటు ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపై నిరసనాకారులు దాడులకు పాల్పడ్డారు. వాళ్ల ఇళ్లల్లోకి చొరబడి ఫర్నిచర్, వాహనాలు, ఇతర సామాగ్రిని తగలబెట్టేశారు. దీంతో అక్కడి పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే త్వరలో మణిపుర్‌కు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

Also Read: ఒకేసారి 99 మంది ఉద్యోగులను తీసేసిన CEO.. కారణం తెలిస్తే షాకే!

Also Read: వార్తా సంస్థలకు సోషల్ మీడియా సంస్థలు డబ్బులు చెల్లించాల్సిందే: అశ్వినీ వైష్ణవ్

Advertisment
తాజా కథనాలు