Starlink: మణిపుర్‌లో సీక్రెట్‌గా స్టార్‌లింక్‌ వాడుతున్న మిలిటెంట్లు..

మణిపుర్‌లో మిలిటెంట్లు స్టార్‌లింక్ నుంచి ఇంటర్నెట్ సేవలు వినియోగిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అంతర్జాతీయ పత్రికలో దీనిపై ఓ కథనం కూడా వచ్చింది. సరిహద్దులోని కొన్ని ప్రాంతాల్లో మిలిటెంట్లు స్టార్‌లింక్ సేవలను వాడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

New Update
Starlink Device(File Photo)

Starlink Device(File Photo)

మణిపూర్‌లో జాతుల మధ్య మొదలైన అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్రాంతంలో హింస చెలరేగుతుందో తెలియక అక్కడ టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కీలక విషయం బయట పడింది. ఆ రాష్ట్రంలో మిలిటెంట్లు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ నుంచి ఇంటర్నెట్ సేవలు వినియోగిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఓ అంతర్జాతీయ పత్రికలో దీనిపై ఓ కథనం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

Also Read: హైదరాబాద్ మెట్రోలో యాక్సిడెంట్.. డోర్ మధ్యలో ప్యాసింజర్ ఇరుక్కోవడంతో..!

మణిపుర్‌లో అక్కడి అధికారులు అల్లర్లు జరిగే చోట ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మిలిటెంట్లు స్టార్‌లింక్ సేవలను వినియోగిస్తున్నట్లు సమాచారం. శాటిలైట్‌తో సేవలతో నడిచే స్టార్‌లింక్‌ నుంచి మిలిటెంట్లు ఇంటర్నెట్‌ వాడుతున్నట్లు వార్తా కథనంలో వెల్లడైంది. వాస్తవానికి ప్రస్తుతం ఇండియాలో స్టార్‌లింక్‌కు చట్టబద్ధంగా పర్మిషన్ లేదు. అది మరీ భారత్‌కు ఎలా వచ్చింది అనేదానిపై సందేహాలు నెలకొంటున్నాయి. అయితే మణిపుర్‌ పొరుగున ఉండే మయన్మార్‌లో మాత్రం స్టార్‌లింక్‌కు పర్మిషన్ ఇచ్చినట్లు కథనంలో వచ్చింది. 

Also Read: ఢిల్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కేజ్రీవాల్‌పై పోటీ ఎవరో తెలుసా?

అయితే మణిపుర్‌ సరిహద్దులోని కొన్ని ప్రాంతాల్లో మిలిటెంట్లు స్టార్‌లింక్ సేవలను వాడుతున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్టార్‌లింక్‌ సేవలు అమెరికాతో సహా కొన్ని దేశాల్లో మాత్రమే వినియోగించుకుంటున్నాయి. అయితే భారత్‌లోకి స్టార్‌లింక్ రానుందని గతంలోనే వార్తలు వచ్చాయి. కానీ దీనికి సంబంధించి ఎలాంటి ముందడుగులు పడలేదు. స్టార్‌లింక్‌ సేవల వల్ల ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న ఇంటర్నెట్‌ను వాడొచ్చు. 

Also Read: తల్లిదండ్రుల పర్మిషన్ ఉండాల్సిందే..సోషల్ మీడియాపై కేంద్రం నిర్ణయం!

Also Read: చనిపోయే వరకు ఇక్కడే ఉంటా.. ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన ప్రకటన


 

Advertisment
Advertisment