టాలీవుడ్ లో విషాదం.. మంచు మనోజ్ డైరెక్టర్ మృతి, ఎమోషనల్ పోస్ట్ పెట్టిన హీరో
మంచు మనోజ్ తో 'నేను మీకు తెలుసా?' అనే సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు అజయ్ శాస్త్రి ఇటీవల కన్ను మూశారు. ఆయన మరణంపై మనోజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజయ్ శాస్త్రి మృతితో తనకు తీవ్ర షాక్ అయ్యామని, మాటలు రావడం లేదని భావోద్వేగం తో పోస్ట్ చేశారు.