మంచు ఫ్యామిలీలో మరోసారి విభేదాలు తార స్థాయికి చేరాయి. తాజాగా తన తండ్రి మోహన్ బాబు తనపై, తన భార్య మౌనికపై దాడి చేశారని మనోజ్ ఆరోపించారు. గాయాలతో పహాడీ షరీఫ్ పొళిసై స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. స్కూల్, ఆస్తుల వ్యవహారంపై ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. కాగా నిన్న సాయంత్రం మనోజ్బంజారాహిల్స్రోడ్డు నంబరు 12లోని టీఎక్స్ హాస్పిటల్ లో తన భార్య మౌనికతో కలిసి వచ్చాడు. మనోజ్మెడ, కాళ్లకు గాయాలయ్యాయని, వాపు వచ్చిందని ట్రీట్మెంట్చేసిన డాక్టర్లు చెప్పారు. మెడ తిప్పలేకపోతున్నాడని చెప్పారు. దీన్ని బట్టి మంచు ఫ్యామిలీలో పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తోంది. Also Read : నా కుక్క ప్రేమ కంటే ఏ ప్రేమ గొప్పది కాదు.. చైతూ టార్గెట్ గా సమంత పోస్ట్ బిగ్ ట్విస్ట్.. తాజాగా ఈ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈరోజుతెల్లవారుజామున జల్ పల్లి లో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ వచ్చాడు. మంచు మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ తో పాటు హార్డ్ డిస్క్ ను తీసుకెళ్లాడు. రెండు రోజులుగా మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు, ప్రైవేట్ బౌన్సర్ల తో కాపలా కాస్తున్నారు. కొద్ది రోజులుగా దుబాయ్ లో ఉన్న మంచు విష్ణు తాజాగాహైదరాబాద్ చేరుకున్నాడు. కాసేపట్లో జల్ పల్లి లోని మంచు మనోజ్ ఇంటికి విష్ణు వెళ్లనున్నాడని సమాచారం అందుతోంది. Also Read : తగ్గనున్న 'పుష్ప2' టికెట్ రేట్లు.. ఎప్పటి నుంచంటే? Also Read: విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ Also Read: అసెంబ్లీ దగ్గర గందరగోళం.. BRS MLAలు అరెస్ట్, ట్రాక్టర్‌పై BJP MLAలు