BREAKING: మంచు మనోజ్‌కు తీవ్ర గాయాలు.. హాస్పిటల్‌లో అడ్మిట్!

మంచు మనోజ్ తీవ్ర గాయాలతో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరాడు. కాలికి తీవ్ర గాయం కావడంతో తన భార్యతో కలిసి హాస్పిటల్‌కి వెళ్లాడు. మోహన్ బాబు అనుచరులు తనపై దాడి చేశారని మనోజ్ కంప్లైంట్ ఇచ్చాడు.

New Update
MANCHU MANOJ

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో మంచు మనోజ్ చేరాడు. భార్యతో కలిసి హాస్పిటల్‌కి వెళ్లాడు. కాలికి తీవ్ర గాయం కావడంతో మనోజ్ చికిత్స తీసుకుంటున్నాడు. విద్యానికేతన్ స్కూల్ సిబ్బంది తనపై దాడి చేశారంటూ మనోజ్ పేర్కొన్నాడు. మోహన్ బాబు అనుచరులు తనపై దాడి చేశారని మనోజ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. 

ఏం జరిగిందంటే?

నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే మంచు ఫ్యామిలీలో మరోసారి విభేదాలు తార స్థాయికి చేరాయి. తాజాగా తన తండ్రి మోహన్  బాబు తనపై, తన భార్య మౌనికపై దాడి చేశారని మనోజ్ ఆరోపించారు. గాయాలతో పహాడీ షరీఫ్ పొళిసై స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. స్కూల్, ఆస్తుల వ్యవహారంపై ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. కాగా తనపై తన కుమారుడు మంచు మనోజ్ దాడి చేశాడని మోహన్ బాబు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో మంచు ఫ్యామిలీలో కొడుకు, తండ్రి గొడవ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

ఇది కూడా చదవండి: రేషన్ మాఫియాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. క్లారిటీ!

పరస్పర కేసులు...

అందిన సమాచారం ప్రకారం.. మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గత కొంత కాలంగా ఈ ఆస్తుల వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. పలుమార్లు మనోజ్ తన వాటాపై మోహన్ బాబుతో చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా తాజాగా మరోసారి జరిగిన చర్చల్లో మంచు మనోజ్ అడిగిన దానికి మోహన్ బాబు నిరాకరించడంతో.. వీరి మధ్య గొడవ వాతావరణం ఏర్పడినట్లు తెలుస్తోంది. మధ్యలో తనకు మద్దతుగా వచ్చిన భార్య మౌనిక పై మోహన్ బాబు చేయి చేసుకున్నట్లు మనోజ్ ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై మంచు కుటుంబం మరో సారి వార్తల్లో నిలిచింది. గాయాలతో వెళ్లి మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. మోహన్ బాబు కూడా మనోజ్ పై ఫిర్యాదు చేశారు. ఇలా ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. మరి మంచు ఫ్యామిలీలో భగ్గుమన్న ఆస్తుల వివాదం ఎంత వరకు దారి తీస్తుందో వేచి చూడాలి. 

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారు, ఫోన్ సీజ్!

మోహన్ బాబు స్పందన

తాజాగా దీనిపై మంచు ఫ్యామిలీ స్పందిస్తూ ఆ వార్తల్లో నిజం లేదని చెప్పింది. ‘మోహన్ బాబు, మంచుమనోజ్ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో నిజం‌ లేదు. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కథనాలను కొన్ని మీడియా చానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. ఎవిడెన్స్‎లు లేకుండా అసత్య ప్రచారాలను చేయకండి..' అని మంచు ఫ్యామిలీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. 

ఇది కూడా చూడండి: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్‌..ఈ మార్గంలోనే తొలి రైలు!

గతంలో అన్నతో కూడా...

గతంలో అన్నదమ్ములు మంచు మనోజ్, విష్ణుల మధ్య గొడవ జరిగింది. అర్థరాత్రి మనోజ్ పీఏ ఇంటికి వెళ్లి మంచు విష్ణు అతనిపై దాడి చేశాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న మనోజ్ ఆ గొడవను ఆపేందుకు ప్రయత్నిస్తూ.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన అన్న విష్ణు, తన పీఏను బెదిరిస్తున్నాడని, దౌర్జన్యం చేస్తున్నాడని వీడియోలో చెప్పాడు.

ఇది కూడా చూడండి: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు..భయంతో భక్తులు పరుగులు

ఆ నాడు మంచు మనోజ్, విష్ణు మధ్య జరిగిన దాడిపై మంచు లక్ష్మి స్పందించింది. ఇది ఒక రియాల్టీ షో కోసం చేసిన ప్రమోషన్ వీడియో అని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటి వరకు ఆ షో కు సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ రాలేదు. తాజాగా జరిగిన వ్యవహారంతో ఆనాడు కూడా అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలే జరిగాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు