మంచు ఫ్యామిలీలో తండ్రీ, కొడుకుల మధ్య కొట్లాట ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. తన తండ్రి మోహన్ బాబు తనపై, తన భార్య మౌనికపై దాడి చేశారని మనోజ్ ఆరోపించారు. గాయాలతో పహాడీ షరీఫ్ పొళిసై స్టేషన్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. అయితే ఈ న్యూస్ వచ్చిన కాసేపటికే అది నిజం కాదని, అసలు గొడవే జరగలేదని మోహన్ బాబు టీమ్ తెలిపింది. కట్ చేస్తే.. నిన్న సాయంత్రం మంచు మనోజ్ మనోజ్బంజారాహిల్స్రోడ్డు నంబరు 12లోని టీఎక్స్ హాస్పిటల్ లో తన భార్య మౌనికతో కలిసి వచ్చాడు. ఆ సమయంలో మీడియా గొడవ గురించి అడిగితే ఏం చెప్పలేదు. Also Read : నా కుక్క ప్రేమ కంటే ఏ ప్రేమ గొప్పది కాదు.. చైతూ టార్గెట్ గా సమంత పోస్ట్ అయితే డాక్టర్లు మాత్రం మనోజ్ మెడ, కాళ్లకు గాయాలయ్యాయని, వాపు వచ్చిందనిచెప్పారు. దీంతో అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరిగిందనేది ఎవ్వరికి అర్థం కావడం లేదు. అయితే ఈ గొడవపై తాజాగా పోలీసులు పూర్తి వివరణ ఇచ్చారు. Also Read: పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనల మధ్య ఉభయసభలు వాయిదా జరిగింది ఇదే.. పోలీసుల కథనం ప్రకారం.. కొన్నాళ్లుగా సినీ నటుడు మోహన్ బాబు ఆయన కొడుకు మంచు మనోజ్, ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు జల్పల్లిలోని ఫాంహౌస్‌లో ఉంటున్నారు. ఆదివారం తన తండ్రి దాడి చేశాడని మంచు మనోజ్ డయల్100 కు ఫోన్ చేసి చెప్పారు. పహాడీ షరీఫ్ పోలీసులు జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. తమ కుటుబంలో విబేధాలు ఉన్నాయని, వాటిని తామే పరిష్కరించుకుంటామని మోహన్‌బాబు చెప్పడంతో అక్కడ్నుంచి వచ్చేసినట్లు పేర్కొన్నారు. Also Read : మంచు ఫ్యామిలీ కొట్లాటలో బిగ్ ట్విస్ట్.. మనోజ్ ఇంటికి విష్ణు Also Read: బీజేపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్య