![manchu](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2024/12/08/xC4LaMrEBI5lpsXmafcZ.jpg)
మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై మరొకరు దాడి చేసుకుని.. పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసుకున్నారని పలు టీవీ ఛానెల్స్ తో పాటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తన తండ్రి మోహన్ బాబు తనపై, తన భార్య మౌనికపై దాడి చేశారని, గాయాలతో మంచు మనోజ్.. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడని, స్కూల్, ఆస్తుల వ్యవహారంపై ఈ గొడవ జరిగినట్లు వార్తలు రావడం ఇండస్ట్రీలో చర్చనీయంశంగా మారింది.
అదంతా ఫేక్..
అయితే తాజాగా దీనిపై మంచు ఫ్యామిలీ స్పందిస్తూ ఆ వార్తల్లో నిజం లేదని చెప్పింది.' ‘మోహన్ బాబు, మంచుమనోజ్ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో నిజం లేదు. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కథనాలను కొన్ని మీడియా చానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. ఎవిడెన్స్‌లు లేకుండా అసత్య ప్రచారాలను చేయకండి..' అని మంచు ఫ్యామిలీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది.